వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా తీవ్రంగా విమర్శలు చేశారు. పవన్ కార్లు మార్చినట్లు.. భార్యలను మారుస్తారని మండిపడ్డారు. ఇప్పటికే నలుగుర్ని మార్చారని వెటకారం ఆడారు. బంద్ ఎలా జరిగిందో.. వివరించేందుకు సామర్లకోటలో జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. బంద్ విఫలం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని మండిపడ్డారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్.. జగన్ పై చేసిన విమర్శల గురించి మీడియా.. జగన్ ను ప్రశ్నించింది. తనకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఉంటే.. జగన్ లా పారిపోనని… కచ్చితంగా పోరాడేవాడినని.. పవన్ కల్యాణ్ .. సోమవారం విజయవాడలో విమర్శలు చేశారు. ఈ విమర్శలపైనే జగన్ ను .. మీడియా ప్రశ్నించింది.
మీడియా ప్రశ్నలతో జగన్ కంట్రోల్ తప్పిపోయారు. మన కర్మకొద్దీ పవన్కళ్యాణ్ లాంటి వాళ్ల మాటలకు కూడా…సమాధానం చెప్పాల్సి వస్తోందన్నారు. నాలుగేళ్ళు టీడీపీ, బీజేపీతో కలిసి కాపురం చేసి…ఏపీ ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి పవన్కళ్యాణ్ అన్నారు. పవన్ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అని తేల్చేశారు. అంతే కాదు.. వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేశారు. కార్లు మార్చినంత ఈజీగా పవన్ పెళ్ళాలను మారుస్తారన్నారు. ఇప్పటికి పవన్ నలుగురు పెళ్లాలను మార్చారని నాటు భాషలో చెప్పుకొచ్చారు. ఇన్ని చేసి పవన్ పవన్ నైతికత…నిజాయితీ గురించి మాట్లాడతాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసమే.. పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని.. చంద్రబాబును కాపాడాలనుకునే ప్రతిసారి పవన్ ట్వీట్లు పెడతారుని గుర్తు చేశారు.
చంద్రబాబుకు అవసరమైనప్పుడు బయటికి వచ్చి ప్రెస్మీట్ పెడతారు.. మళ్ళీ ఎక్కడికి పోతాడో తెలియదన్నారు. ఇటీవలి కాలంలో.. అటు జగన్, ఇటు పవన్ కానీ.. వైసీపీ, జనసేన మధ్యకాని విమర్శలు పూర్తిగా తగ్గిపోయాయి. కొద్ది రోజుల క్రితం.. పవన్ కల్యాణ్ కు సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ అని జగన్ మండిపడినా.. పవన్ స్పందించలేదు. కానీ నిన్న కార్యకర్తల సమావేశంలో మాత్రం ఒక్కసారి జగన్ పార్లమెంట్ కు, అసెంబ్లీకి పోరని విమర్శలు చేయడంతో జగన్ బరస్టయ్యారు.