పదే పదే అంబేద్కర్ అంటున్నారు భగవంతుడి పేరు స్మరించిన పుణ్యం వస్తుందని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన అంబేద్కర్ ను అవమానించారని ఆందోళనలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వైసీపీ ఎవరూ అడగకపోయినా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలుగులో చెప్పింది. అమిత్ షా అంబేద్కర్ను అవమానించలేదని ఆయన స్పీచ్ మొత్తం వింటే ఎంతో గౌరవించారని అర్థమవుతుందని ట్వీట్ చేసింది. ఇది జాతీయ అంశం కాబట్టి ఇదే ట్వీట్ ఇంగ్లిష్ లో చేయాల్సింది కానీ.. సగం మందికి తెలియకపోతేనే మంచిదని జగన్ అనుకున్నట్లుగా ఉన్నారు.
విషయం ఏమిటంటే ఇక్కడ కూడా జగన్ ద్వంద్వ ప్రమాణాలు పాటించారు. తమ గొప్పలు చెప్పుకున్నారు .. అమిత్ షాను సమర్థించారు కానీ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ కూటమిని విమర్శించలేదు. వారు తప్పు చేస్తున్నారని అనలేదు. వారు అంబేద్కర్ ను ఎప్పుడూ గౌరవించలేదని కూడా మాట్లాడలేదు. గతంలో అయితే బీజేపీని పొగిడి ఇతర పార్టీలను తిట్టేవారు. బీజేపీతో విబేధిస్తారా అని వాళ్లతో కూడా మాటలు పడేవారు. అయినా అలాంటి ట్వీట్లు ఆపేవారు కాదు.
విజయసాయిరెడ్డి అయితే బహిరంగంగానే కాంగ్రెస్ ను దూషించేవారు. పార్లమెంట్ లో అయితే చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని.. ఇండీ పార్టీ కూటమి పార్టీలను ఒక్క మాట అనడం లేదు. అయితే బీజేపీని.. కేంద్రాన్ని మాత్రం పొగడటం ఆపడం లేదు. ఎప్పుడైనా గట్టిగా ప్రశ్నిద్దామని అనుకుంటే ఎప్పటికప్పుడు కొత్త కేసులు వస్తున్నాయి. అమెరికాలో బయటపడిన కొత్త లంచం కేసుతో బీజేపీ అనుకుంటే ఎప్పుడైనా మూసేస్తుంది. అందుకే అడగకపోయినా పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇవ ఆయనను కాపాడతాయా ?