ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం వేస్టు చేసుకున్నారు. అది పూర్తయ్యే సరికి ఎన్నికలు రెండు వారాల్లోకి వచ్చేశాయి. రెండు వారాల్లో రోజుకు ఐదు చోట్ల ప్రచారరం చేసినా 75 నియోజకవర్గాల్లో మాత్రమే పర్యటిస్తారు. కానీ రోజుకు మూడుచోట్ల సభలు పెట్టి.. అది కూడా మూడు రోజులకో సారి సెలవు తీసుకుంటున్నారు.
వరుసగా నాలుగు రోజుల పాటు సభలు పది నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్ ఇప్పుడు గురువారం హాలీడే తీసుకున్నారు. వ్యూహాల కోసం అంటూ కబుర్లు చెబుతున్నారు. సభల్లో ప్రసంగించే సమయం తప్ప మిగతా సమయం వ్యూహాల కోసం కాక వీడియో గేమ్‌ల కోసం కేటాయిస్తారా ? అన్న సెటైర్లు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. గతంలో ఆయన కోసం పని చేసిన స్టార్ క్యాంపెయినర్లు ఒక్కరు కూడా లేరు. జగన్ ప్రచారం చేస్తేనే జనాన్ని సమీకరించలేకపోతున్నారు. ఇతర నేతలకు అసలు చాయిస్ లేదు. దీంతో అభ్యర్థులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కే పరిమితమవుతున్నారు.
మరో వైపు ఎటు వైపు చూసినా కూటమి కనిపిస్తోంది. నాలుగు దిక్కులా క్రౌడ్ పుల్లింగ్ లీడర్స్ తో ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ప్రతీ రోజూ సభలు పెడుతున్నారు. అంతేనా వచ్చే వారంలో రెండు రోజుల పాటు మోడీ కూడా ఏపీలో పర్యటించనున్నారు. వైసీపీ కోసం ప్రచారం చేసే వారెవరూ లేకపోవడంతో పూర్తి స్థాయిలో కూటమి డామినేషన్ కనిపిస్తోంది. ఇది క్షేత్ర స్థాయిలో వైసీపీపై వ్యతిరేక ప్రచారం జరగడానికి మరింత కారణం అవుతోంది.