ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. వైఎస్ జగన్ .. ఢిల్లీలో అలాంటి ఇంప్రెషన్ వేసే ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ… ప్రమాణస్వీకారం తర్వాత.. అన్ని శాఖలను సమీక్షిస్తానని.. కాంట్రాక్టులన్నింటినీ పరిశీలిస్తానని ప్రకటించారు. అవినీతి ఉంటే రద్దు చేసేసి.. అంత కంటే.. తక్కువకు పనులు చేసే వారికి కాంట్రాక్టులు ఇస్తానని ప్రకటించారు.
ఏపీలో కాంట్రాక్టర్లందరూ మార్పు ఖాయమే..!
తెలుగుదేశం పార్టీ హయాంలో.. ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. జగన్ చాలా కాలంగా చెబుతున్నారు. ఈ ఆరు లక్షల కోట్ల అవినీతిని టీడీపీ నేతలే చేశారని.. ఆ సొమ్మంతా వారి వద్ద నుంచి కక్కించాలనే లక్ష్యంతో.. జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది నేతలు… అసలు ధర కంటే బాగా ఎక్సెస్‌కు పొందారని… ఆ కాంట్రాక్టులన్నింటినీ సమీక్షించాలని.. జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా… రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీ యజమాని అయిన… సీఎం రమేష్ పై జగన్, విజయసాయిరెడ్డి చాలా సార్లు ఆరోపణలు చేశారు. సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలు చేసినప్పుడు… సాక్షి పేపర్లో కథనాల మీద కథనాలు రాశారు. వాటన్నింటినీ ఇప్పుడు జగన్ బయటకు తీసే అవకాశం ఉంది.
తక్కువకు చేసే వాళ్లకి పనులు..!
ఏ కాంట్రాక్ట్‌లో అవినీతి జరిగినా.. ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసేసి… ఇతరులకు ఇస్తామని.. మళ్లీ టెండర్లు పిలుస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అంటే.. బహుశా.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపుగా.. కాంట్రాక్టర్లందరూ మారిపోవచ్చు. ఏ స్థాయిలో మారతారన్న క్లారిటీ లేదు కానీ… టీడీపీ నేతలకు.. ఎలాంటి కాంట్రాక్టులున్నా… ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే.. పనులు మధ్యలో ఆపేసి.. మళ్లీ కొత్త కాంట్రాక్టులు పిలిస్తే.. అంచాలు పెరిగే అవకాశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఎవరు తక్కువ చేస్తారో.. వారికే ఇస్తామంటున్నారు కాబట్టి.. సమస్యేమీ ఉండదు.
అస్మదీయులకు ఇస్తున్నారని ఆరోపణలు వస్తే..?
అయితే… నామినేషన్ పద్దతిన కాంట్రాక్టులు పొందిన వారు పనులు చేయకపోతే… లేకపోతే అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయితే ప్రభుత్వం తీసేయవచ్చు కానీ… నిబంధనల ప్రకారం టెండర్లలో… ప్రాజెక్టులు పొందిన వారి కాంట్రాక్టులు రద్దు చేయడం.. అంత తేలిక కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. ఆయా సంస్థలు .. కోర్టుకెళ్లి.. నష్టపరిహారం డిమాండ్ ప్రమాదం కూడా ఉంది. మరి ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. అవినీతిని అంతం చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఒక వేళ.. జగన్.. ఏ కాంట్రాక్టర్‌ను మార్చినా… చివరికి ఆయనపై కూడా అవినీతి ఆరోపణలు వస్తాయి. రాజకీయం అంటే అంతే.. కానీ.. జగన్ అవినీతిని రద్దు చేయాలన్న లక్ష్యంతో కాంట్రాక్టర్లను మారుస్తారు కాబట్టి… ఆరోపణలను ప్రజలు నమ్మకపోవచ్చు.