ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ నేతలు ఇప్పటివరకూ బీజేపీని టార్గెట్ చేయలేదు. టీడీపీపైనే విరుచుకుపడుతున్నారు. బీజేపీని అనలేని నిస్సహాయతో.. రాజకీయ వ్యూహమో కానీ.. ఇప్పటి వరకూ.. వారు బీజేపీపై ఆరోపణలు చేయలేదు. ముఖ్యమంత్రి జగన్ కూడా.. టీడీపీపైనే విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో.. ఇతరులు… అలాంటి ఘటనలు జరిగితే.. బీజేపీకే లాభం కాబట్టి… అంటూ.. ఆ దిశగా కొన్ని విశ్లేషణలు చేస్తున్నారు. అయితే అమ్మఒడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ వ్యూహం మార్చారు. పరోక్షంగా బీజేపీని కూడా టార్గెట్ చేశారు.
జనసంచారం లేనిచోట విగ్రహాలు ఎందుకు ధ్వంసం చేస్తున్నారో.. ఆ తరువాత అక్కడికి ఎందుకు వెళ్తున్నారో … రథాలు తగులబెట్టి.. మళ్లీ రథయాత్ర పేరుతో ఎందుకు వెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ రథయాత్ర చేయబోతున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చింది. రామతీర్థం నుంచి ప్రారంభించి.. ఆలయాలపై దాడులు జరిగిన అన్ని చోట్లకూ వెళ్లాలని అనుకుంటున్నారు. పదిహేడో తేదీన రూట్ మ్యాప్ ఖరారు చేయాలనకుంటున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి బీజేపీని కూడా కలిపి విమర్శిస్తున్నారన్న చర్చ ప్రారంభమయింది.
పథకాలు ప్రారంభిస్తున్నప్పుడు ముందో తర్వాతో.. ఆలయాలపై దాడులు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిపనులు ప్రపంచం దృష్టికి రాకూడదనే పథకాలు ప్రారంభించినప్పుడల్లా అలజడి సృష్టిస్తున్నారని.. దేవాలయాలపై దాడులు ఇందులో భాగమేనని సీఎం ఆరోపించారు. ఆలయ భూములు కాజేసిందెవరో.. అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసిందెవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాజకీయ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి… వారికి బుద్ది చెప్పాలన్నారు. ద్రబాబు, లోకేష్‌కు ప్రజలపై ప్రేమ లేదని విమర్శించారు.
అమ్మఒడి పథకంలో వచ్చే ఏడాది నుంచి వినూత్నమైన మార్పు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 9 నుంచి 12వ తరగతి వరకూ ఉండే విద్యార్థులకు అమ్మఒడి డబ్బులు వద్దనుకునే విద్యార్థులకు ల్యాప్ ట్యాప్‌లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఈ అంశంపై చర్చలు జరిపామని… పద్దెనిమిది వేలు చేసే ల్యాప్ ట్యాప్ల్ని.. పదిహేను వేలకే ఇప్పిస్తామని.. సర్వీస్ కూడా.. ఉచితంగా చేయిస్తామిని హామీ ఇచ్చారు.