మార్గదర్శి ఆర్థిక సేవల సంస్థ. డిపాజిట్ల సంస్థ కాదు. ఆ సంస్థను ఆర్థికంగా దెబ్బతీసి కుంగిపోయేలా చేయాలనుకుని జగన్ చేస్తున్న ప్రయత్నాలు… వేస్తున్న విన్యాసాలు ఒక శాతం కూడా సక్సెస్ కావడం లేదు. దాంతో ఆయన పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంకేమైనా చేయండి అని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. చేయడానికి వారేమీ లేక.. విచారణ పేరుతో రామోజీరావు ఇంటికి వెళ్లడం.. సాక్షిలో తప్పుడు ప్రచారాలు చేయడం కామన్ అయిపోయింది. ఇదంతా ఎందుకు అంటే ఖాతాదారులంతా వెల్లువలా వచ్చి తమ సొమ్ములు తమకు ఇవ్వాలని మార్గదర్శి ముందు క్యూ కడతారని. కానీ ఒక్కరు కూడా.. తమ చిట్ సొమ్ము వెనక్కి ఇచ్చేయాలని రావడంలేదు.
మార్గదర్శి ఆర్థిక సామర్థ్యం లేదని సీఐడీ ప్రచారం – అయినా ఎవరూ నమ్మలేదు !
మార్గదర్శికి ఆర్థిక సామర్థ్యం లేదని సీఐడీ అధికారులు తీర్పిచ్చారు. దాన్ని నీలి, కూలి మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. చిట్స్ పాడుకున్న వారికి డబ్బులివ్వలేని స్థితిలో ఉందని ప్రచారం చేసింది. ఆస్తులు అటాచ్ చేశామని చెప్పుకుంది. చివరికి మార్గదర్శి ఎండీ సీఐడీ విచారణలోనే అంగీకరించారంటూ కథలు అల్లేసింది. అయినా ఎవరూ నమ్మలేదు. ఖాతాదారులు మార్గదర్శి బ్రాంచ్లకు తమ చిట్స్ సొమ్ము కట్టడానికే వస్తున్నారు కానీ… రద్దు చేసుకోవడానికి రావడం లేదు. ఈ పరిణామాలు చూసి జగన్మోహన్ రెడ్డి మరింత ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు.
డిపాజిట్లే తీసుకోరు.. అలాంటప్పుడు డిపాజిటర్లు ఎవరుంటారు ? ఈ లాజిక్ తెలియదా ?
నిజానికి మార్గదర్శి బిజినెస్ మోడల్ చూస్తే.. ఎవరి సొమ్మూ ఆ సంస్థ వద్ద ఉండదని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఆసంస్థ చిట్స్ నిర్వహిస్తుంది. అంటే ఇరవై మంది సభ్యులు… ప్రతీ నెలా లక్ష కడితే.. ఆ లక్ష ఇరవై మందిలో ఒకరికి ఇస్తుంది. అంటే కట్టిన సొమ్ము అంతా ఆ గ్రూప్ సభ్యులకే ఆ నెల చేరిపోతుంది. డిపాజిట్లు తీసుకోరు. ఎవరైనా సెక్యూరిటీలు ఇవ్వడానికి ఇష్టపడకపోతే.. ఎన్ని నెలలు చిట్ పెండింగ్ ఉంటే.. అన్ని నెలల సమానమొత్తానికి నగదును తీసుకునిప్రతీ నెలా జమ చేసుకుంటారు. అంటే .. ఎవరూ కూడా.. తమ డబ్బులు మార్గదర్శిలో డిపాజిట్ చేయలేదని అర్థం. మరి తమ సొమ్ము ఇవ్వమని ఎలా వస్తారు ?
మార్గదర్శిపై ఖాతాదారులకు కొండంత నమ్మకం – జగన్ ను నమ్మని జనం
మొత్తంగా జగన్ రెడ్డి మార్గదర్శిపై గుడ్డిగా చేస్తున్న యుద్ధం వల్ల.. ఆయనే చిత్తుగా ఓడిపోతున్నారు. ఇప్పుడు మార్గదర్శిలో తమ డబ్బులు ఇవ్వాలని ఎవరూ రావడంలేదని.. ఇదంతా ఆ సంస్థపై నమ్మకమేనని ప్రచారం జరుగుతోంది.ఏపీలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీలో కూడా తప్పుడు ప్రచారం చేసినా ఆ సంస్థ కు చిన్న ఇబ్బంది కలిగించలేకపోయారు. ఎలా చూసినా మార్గదర్శిపై ఖాతాదారులు చూపిస్తున్న నమ్మకంలో ఒక్క శాతం కూడా జగన్ పై లేదని తనకు తానే నిరూపించుకున్నారు జగన్ రెడ్డి. పాపం !