ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విశాఖ మారబోతోంది. ఈ మేరకు కేబినెట్ అధికారిక ప్రకటన చేయబోతోంది. జీఎన్ రావు కమిటీ నివేదికను యథాతథంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం ఖాయగా కనిపిస్తోంది. నిజానికి జీఎన్ రావు రిపోర్ట్ అనేది అదికారింగా చూపించుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రక్రియ మాత్రమే. ముందుగానే నిర్ణయం జరిగిపోయింది. జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ రాక ముందే.. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను డిక్లేర్ చేశారు. తర్వాత జీఎన్ రావు కమిటీ అదే నివేదిక ఇచ్చింది.
నిజానికి ఉత్తరాంధ్ర ప్రజలు కానీ.. విశాఖ ప్రజలు కానీ.. రాజధాని కావాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. ఆ డిమాండ్ రాయలసీమ వాసుల్లో ఉంది. రాజధానిని మార్చాలనుకుప్పుడు.. అదే వెనుకబాటు ప్రాతిపదికగా.. రాజధానిని పెట్టాలనుకున్నప్పుడు.. ఎవరికైనా రాయలసీమే గుర్తుకు రావాలి. రాజధాని పెడితే అభివృద్ధి జరిగిపోతుందన్నట్లుగా ప్రభుత్వం చెబుతుంది కాబట్టి… ఇంకా మొదటి ప్రిఫరెన్స్ రాయలసీమకే ఇవ్వాలి. కానీ.. హైకోర్టు మూడు బెంచ్‌లలో ఓ బెంచ్‌ను మాత్రం కర్నూలుకు ఇచ్చి.. రాజధానిని దూరం చేశారని.. ఇది తమకు తీవ్రంగా అవమానించడమేనన్న అభిప్రాయం రాయలసీమ వాసుల్లో ప్రారంభమయింది. అందుకే జగన్ నిర్ణయంపై నేతల్లో కానీ.. ప్రజల్లో కానీ సానుకూలత కనిపించడం లేదు.
రాజధాని మార్చుతానని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టలేదు. పైగా.. చంద్రబాబు అమరావతిలో ఇల్లు కట్టుకోలేదని.. తాను కట్టుకున్నానని… అమరావతి విషయంలో చంద్రబాబు కంటే తనకే ఎక్కువ కమిట్మెంట్ ఉందని నమ్మించారు. తీరా అధికారం చేతికి వచ్చిన తర్వాత రాజధాని మార్చేస్తున్నారు. కానీ.. తన ఇల్లు కట్టుకోవడం.. ఇతర విషయాలన్నీ.. నమ్మించడానికేనని.. అంతకు ముందు నుంచే.. రాజధాని మార్పు ఆలోచన ఉందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయంటున్నారు. కారణం ఏదైనా.. రాజధాని మాత్రం మారడం ఖాయంగా కనిపిస్తోంది.