కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి “కాపు నేస్తం” పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించబోతున్నారు. నవరత్నాల్లో భాగంగా మేనిఫెస్టోలో సీఎం జగన్ జగన్ … 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య కాపు మహిళల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద.. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన రెండు లక్షల 35వేల మందికి రూ.354 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తారు.
ఈ పథకానికి అర్హత పొందాలంటే.. కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. అంటే.. పట్టణాల్లో పన్నెండు వేలు.. పల్లెల్లో పదివేలు ఆదాయం మించకూడదు. కుటుంబానికి 3 ఎకరాలలోపు మాగాణి లేదా 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉండొచ్చు. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండొచ్చు. అంత కంటే ఎక్కువ ఉంటే అర్హులు కాదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు.. లేదా ఇతర ఏ నిర్మాణాలు ఉన్నా అర్హులు కాదు. నాలుగు చక్రాల వాహనం ఉన్నా అర్హత ఉండదు. కుటుంబంలో ఎవరైనా ఇన్కం ట్యాక్స్ చెల్లిస్తే కూడా అర్హులు కారు. ఇలా అనేక రకాల వడపోతల అనంతరం.. రెండు లక్షల 305 వేల మంది వరకూ లబ్దిదారులు ఉన్నట్లుగా వాలంటీర్లు గుర్తించారు.
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 76వేల మంది వరూక లబ్ది పొందుతూండగా.. అతి తక్కువగా విజయనగరం జిల్లాలో కేవలం 3726 మంది మాత్రమే అర్హులున్నట్లుగా గుర్తించారు. అర్హులైన వారికి పథకం లబ్ది కలగకపోతే.. గ్రామ సచివాలయాల్లో.. దరఖాస్తులు ఇస్తే… తక్షణం పథకం వర్తింప చేసి..నగదు సాయం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. కఠినమైన నిబంధనలు… కారణంగా… కొన్ని లక్షల మంది అర్హత కోల్పోతున్నారన్న ఆవేదన.. కాపు మహిళల్లో వ్యక్తమవుతోంది. అర్హతలను తగ్గించాలన్న విజ్ఞప్తులు ఎక్కువగా వస్తున్నాయి.