ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు..ఇలా ఏ ఒక్క కుల కార్పొరే్షన్ను వదలకుండా.. ఖాళీ చేసి… అమ్మఒడికి నిధులను బదిలీ చేసిన ప్రభుత్వం.. పిల్లల తల్లులకు ఇస్తామన్న రూ. 15వేలలో ఒక వేయికి కోత పెట్టే ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకం ప్రారంభోత్సవ వేదిక మీదనే ప్రకటించారు. రూ. 15వేలలో రూ. 14వేలు మీరు ఉంచుకోండి.. రూ. ఒక్క వెయ్యి మాత్రం.. మావయ్యకు ఇచ్చానని అనుకోండి అని నేరుగా ప్రకటించారు. ఆ రూ. వెయ్యి.. బడి అభివృద్ధి కోసం కేటాయిస్తామని జగన్ ప్రకటించారు. ఒక్కో తల్లికి ఇలా రూ. వెయ్యి తగ్గించి .. ఆ మొత్తాన్ని పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తామని జగన్ చెబుతున్నారు.
నిజానికి పాఠశాలల అభివృద్దికి జగన్మోహన్ రెడ్డి .. నిన్న – నేడు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశలో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం మచేశారు. మొత్తంగా.. రాష్ట్రంలోని 47వేల స్కూళ్లలో నాడు-నేడు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ స్కూళ్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు, అదనపు తరగతులు, ఇంగ్లీష్ ల్యాబ్లు నిర్మించనున్నారు. నవంబర్ పధ్నాలుగో తేదీన ఈ పథకాన్ని జగన్ ప్రారంభించినప్పటికీ.. ఒక్కటంటే.. ఒక్క స్కూల్లోనూ.. పనులు ప్రారంభం కాలేదు. వివిధ కంపెనీల సీఎస్ఆర్ నిధులను.. కూడా.. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రభుత్వాధినేతకు సన్నిహితమైన కొన్ని కంపెనీలు విరాళాలు ఇచ్చాయి. అయితే.. అవి చాలా పరిమితం.
కనెక్ట్ టు ఆంధ్రా అనే మరో కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ పథకానికి కొన్ని వేల కోట్లు కావాల్సి ఉండటంతో.. నిధుల సేకరణ కష్టంగా మారింది. అందుకే.. అమ్మఒడి నుంచి ఒక్కో వెయ్యి వసూలు చేస్తే.. కొంత భారం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే.. సంక్షేమ నిధులు.. అమ్మఒడికి.. అమ్మఒడి నిధులు..నాడు -నేడు పథకానికి.. ఇలా రీసైకిల్ చేస్తున్నారన్నమాట..!