రాజకీయ నేతల్లో జగన్‌ది ఓ భిన్నమైన స్వభావం. తనకు ఇష్టం లేని నేతలు ఎవరైనా చనిపోతే మనసులో బాగా అయిందని సంతోషపడతారేమో కానీ.. వారిని చివరి సారిగా చూసి నివాళులు అర్పిద్దామని కూడా అనుకోరు. ఆయన ఇలా అయిష్టత ప్రదర్శించే నేతల్లో ఒకరు రోశయ్య. అంతకు ముందు నుంచి ఆయనపై ఉన్న కోపం.. చనిపోయిన తర్వాత కూడా బయటపడింది. చనిపోయినప్పుడు కనీసం నివాళులు అర్పించేందుకు కూడా వెళ్లలేదు.
ఆ తర్వాత ఎప్పుడూ ఆయన జయంతి, వర్థంతిలకు ఎప్పుడూ నివాళులు అర్పించలేదు. ఆర్యవైశ్యులంతా కలిసి నివాళులు అర్పించేందుకు ..విగ్రహం పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలకూ సహకరించలేదు. దీనికి కారణం వైఎస్ చనిపోయిన తర్వాత హైకమాండ్ రోశయ్యను సీఎంగా చేయడమే. తనను కాదని రోశయ్య సీఎం పదవి తీసుకున్నారన్న కోపం ఉంది. ఆయనను ప్రశాంతంగా సీఎం పదవిలో ఉండనీయలేదు. జగన్ పెట్టిన ఇబ్బందులు పదవి వదిలేసుకున్నారు. చివరికి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంను చేసింది హైకమాండ్.
ఆ కోపం చనిపోయినా పోలేదు. ఇప్పుడు జగన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మాత్రం ఆయన వర్థంతిని గుర్తు చేసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత మా కుటుంబానికి ఆప్తుడు ఆయన రోశయ్యకు వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియా ఒక్క సారిగా బ్లాస్ట్ అయిపోయింది. రోశయ్యకు పదవిలో ఇప్పుడు ఒక్క సారి కూడాఎందుకు నివాళులు అర్పించలేదని ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు.