చంద్రబాబు పాలన మోసాలను అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి తనను కలిసిన అంబటి రాంబాబు, నందిగం సురేష్ వంటి పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. లండన్ నుంచి వచ్చాక పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశానికి ఇలాంటి వారు తప్ప ఎవరూ హాజరు కాలేదు. వారందరినీ ప్రజల్లోనే ఉండాలని బతిమాలుకున్నాడు. కానీ తాను చెప్పినట్లుగా జనంలోకి తాను కూడా వస్తానని మాత్రం గుర్తు చేసుకోవడం లేదు.
కార్యకర్తలతో జగనన్న .. షెడ్డుకెళ్లినట్లేనా ?
కొద్ది రోజుల కిందట జగన్ “ కార్యకర్తలతో జగనన్న – భవిష్యత్ కు దిశానిర్దేశం” పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించారు. సంక్రాంతి అయిపోగానే కార్యకర్తలకు సంక్రాంతి వస్తుందన్నారు. ఆయన ఆ టూర్ లో ఏం చేస్తారో కూడా వివరించారు. అందర్నీ కలుస్తానని వివరించారు. జగన్ చెప్పిన తీరుతో కార్యకర్తలు చాలా మంది ఆయన నిజంగానే వస్తారనుకున్నారు. కానీ జగన్ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. మూడు రోజులు తాడేపల్లి.. నాలుగు రోజులు బెంగళూరు షెడ్యూల్ కే సమయం కేటాయిస్తున్నారు.
బెట్టింగులు, బిల్లుల బాధితులు నిలదీస్తారనే !
జగన్ ఎందుకు వెనుకడుగు వేశారన్నది చాలా మందికి అర్థం కావడం లేదు కానీ.. అసలు కారణం మాత్రం అగ్రనేతలకు బాగా తెలుసని అంటున్నారు. పవన్ కల్యాణ్ పులివెందులలో కార్యకర్తలను కలవడానికే తంటాలు పడుతున్నారు. వచ్చిన వారంతా బిల్లులు సారూ అంటున్నారు. ఆయన పాలనలో బిల్లులు ఇవ్వలేదు. పనులు చేయించారు. ఇప్పుడు బిల్లులు రావడం లేదు. మరో వైపు పార్టీని నమ్ముకుని బెట్టింగులు కాసి నష్టోయామని ఆదుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. వీరు ప్రతి నియోజకవర్గంలోనూ ఉంటారు. వారు పరువు తీస్తారన్న భయంతో జగన్ వెళ్లడం లేదని చాలా మందికి క్లారిటీ ఉంది.
ఇలా ఎంత కాలం ?
ఇటీవల జగన్ తో ఫోటో దిగుతా అని తాడేపల్లి ఇంటి ముందు ఓ మహిళ ధర్నా చేసింది. ఆమెను తీసుకెళ్లి జగన్ తో ఫోటో తీయించారు సిబ్బంది. ఆమె బయటకు వచ్చి మళ్లీ ధర్నా చేశారు.. తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని జగన్ సాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల నుంచి ఇలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. వాటిని తగ్గించిన తర్వాత జగన్ ను జనంలోకి పంపాలని సజ్జల ప్లాన్. కానీ అది ఎప్పటికి అన్నది వైసీపీలో సస్పెన్స్.