నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి అంబేద్కర్ విగ్రహం నిర్మించి తన చేతుల మీదుగా ఆవిష్కరించిన జగన్ రెడ్డి ..ఆ కార్యక్రమాన్ని తన ఎన్నికల ప్రచార కార్యక్రమంగా మార్చేసుకున్నారు. వేల బస్సుల్ని పెట్టి బెదిరించి వాలంటీర్లు తీసుకు వచ్చినా జనాన్ని కూర్చోబెట్టి ఎప్పుడూ చెప్పే సోది చెప్పారు. జగన్ రెడ్డి ప్రసంగంలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ పదే పదే ఆరున్నొక్క రాగంలో వినిపించారు. మీ బిడ్డ మీ బిడ్డ అంటూ అదే పనిగా దీనంగా ప్రసంగించారు.
సొంత తల్లినే ఆయన ఈ బిడ్డ పట్టించుకోలేదని గ్గగోలు పెడుతూంటే. ఆయన మాత్రం ఏ మత్రం సిగ్గుపడకుండా మీ బిడ్డ అంటూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారం తరహాలో తాను పెద్ద ఎత్తున అన్ని వర్గాలకు పదవులు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అవన్నీ విపక్షాలు ఎందుకివ్వలేదని చెప్పుకొచ్చారు. ఆ పార్టీలు పెత్తందారులన్నారు. తాను అమలు చేసిన పథకాలేమీ వారు అమలు చేయలేదన్నారు. విపక్షాలు దోచుకున్నాయని ఆరోపించారు. జగన్ రెడ్డి తాను ఏపీని ఏదో ఉద్దరించేశానని చెప్పుకునేందుకు పేదల అభివృద్ధికి .. రెండున్నర లక్షల కోట్లు నగదు బదిలీ చేశానని చెప్పుకొచ్చారు. ఆయన ఎప్పుడూ పెట్టే బటన్ నొక్కే ప్రసంగాల్లో ఉండే స్పీచ్ లు తప్ప అంబేద్కర్ విగ్రహావిష్కరణలోనూ కొత్తదనం లేదు. కేవలం ఎన్నికల ప్రచారసభలగానే పూర్తి చేశారు.
తెలంగాణలో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమయంలో రాజకీయాలు చేయలేదు. అంబేద్కర్ మనవడ్ని పిలిపించి ఆయనతో ఆవిష్కరింపచేశారు. కానీ జగన్ రెడ్డి మాత్రం తానేపెద్దగా ఆవిష్కరించుకోవడం మాత్రమే కాదు.. అంబేద్కర్ పేరుతో పోటీగా తన పేరు కూడా కనిపించేలా రాయించుకున్నారు. ఆయన తీరు చూసి సొంతపార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఈ ఐదేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీలు పడిన బాధలే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి.