జగన్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. బటన్ నొక్కడానికి ఎప్పుడైనా సభ పెట్టి అదే జిల్లాల పర్యటనలని ఫీలయ్యేవారు. అంతే తప్ప ఆయన నేరుగా ప్రజల్లోకి వెళ్లిన సందర్భం.. ప్రజల్ని కలిసిన సందర్భమే లేదు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన రెండు నెలల్లోనే రాష్ట్రం మొత్తం చుట్టే శారు. దాదాపుగా ప్రతీ రోజూ ఆయన ఏదో ఓ జిల్లా పర్యటనకు వెళ్తూనే ఉన్నారు. నెల ఒకటో తేదీ ఆదివారం వస్తుందని 31 ఒకటో తేదీనే పించన్ల పంపిణీ చేయడానికి ఆయన కర్నూలు జిల్లాకు వెళ్తున్నారు.
చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసి గట్టిగా రెండున్నర నెలలు అవుతోంది. ఈ క్రమంలో ఆయన దాదాపుగా అన్ని ఉమ్మడి జిల్లాలను చుట్టేశారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక సవాళ్లను క్లియర్ చేసేందుకు ఢిల్లీ పర్యటనలు చేస్తూ.. మరో వైపు జిల్లాలకు వెళ్తున్నారు. సీఎం ప్రజల్లో ఉన్నారు అన్న భావన కల్పిస్తున్నారు. అందుబాటులో ఉంటారని.. ఎలాంటి కష్టం వచ్చినా స్పందిస్తారన్న భావనకు వచ్చేలా చేశారు. ఐదేళ్ల పాటు జరిగిన ఘోరాలను.. కష్టాలను ఇప్పటికిప్పుడు వెంటనే పరిష్కారం సాధ్యం కాదు.. కానీ మెల్లగా పరిష్కారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ దిశగా ముందడుగులు వేస్తున్నారు.
హామీల అమలు విషయంలోనూ పురోగతి ప్రజలకు సంతృప్తి కలిగేలా ఉంటుంది. జగన్ మళ్లీ గెలిస్తే నాలుగేళ్ల తర్వాతే 3250 పెన్షన్ ఇస్తామన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే నాలుగు వేలు ఇస్తున్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఏడాదిలోపు అమలు చేయాల్సిన తల్లికి వందనం పథకంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమయింది. అమరావతి, పోలవరం పట్టాలెక్కుతున్నాయి. పలు చోట్ల రోడ్లను బాగు చేయడం కూడా ప్రారంభమయింది.
మొత్తంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఎలా ఉంటుందో… అలా యాక్టివ్ గా మారుతోంది. వ్యవస్థల ధ్వంసం చేసిన జగన్ పాలన వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా… పాలనలో మార్పునుప్రజలు ఫీల్ అవుతున్నారని అనుకోవచ్చు.