మహిళా దినోత్సవం సందర్భంగా తెల్లవారిన వెంటనే జగన్ ఓ ట్వీట్ పెట్టారు. మహిళలకు తాను గొప్పగా సేవ చేశానని వారిని ఆర్థికంగా బలోపేతం చేశానని.. ఇక నుంచి కూడా తన రాజకీయం .. అంటే భవిష్యత్ లోనూ తనది మహిళాభ్యుదయమేనని ఆయన చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో మహిళలకు ఏం చేశారో ఆయనకే తెలియాలి కానీ.. ఆయన కుటుంబంలోని మహిళలు మాత్రం.. బాగా గుర్తు చేసుకుంటారు.
ఆస్తి కోసం తల్లిని కోర్టుకు లాగిన జగన్ మహిళాభ్యుదయం గురించి మాట్లాడితే.. అందర్నీ పైకి తెస్తానని ట్వీట్లు పెడితే కామెడీగా ఉంటుంది. ఆ ట్వీట్ కూడా అలాగే ఉంది. జగన్ మోహన్ రెడ్డి అబద్దాలు చెబుతూ తనకు చెందిన సరస్వతి పవర్ ను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె తల్లి ఎన్సీఎల్టీ కోర్టుకు తెలిపింది. తోడబుట్టిన చెల్లికి ఆస్తుల్ని పంచుతానని నాన్నకు మాట ఇచ్చి ఇప్పుడు ఆమెను కోర్టుకు లాగారు. వీరిద్దరిపై వైసీపీ సోషల్ మీడియా అంటే జగన్ సైన్యం చేసిన అరాచక వ్యాఖ్యల గురించి చెప్పాల్సిన పనిలేదు.
మరో చెల్లి వైఎస్ సునీతారెడ్డికి ఆయన చేసిన అన్యాయం మరో అన్న చేయడమో. తన తండ్రిని చంపేశారని న్యాయం చేయాలని వేడుకుంటే.. ఆమెపైనే తండ్రి హత్య కేసును బనాయించే ప్రయత్నం చేసేంత క్రూరత్వం ఎవరికి ఉంటుంది?. అయినా జగన్ రెడ్డి మహిళాభ్యుదయమే తన లక్ష్యం అని ట్వీట్లు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. అదే మన ప్రజాస్వామ్యంలోని గొప్పతనం.