వ్యాక్సిన్ విషయంలో కేంద్రంపై ఒకే మాటగా ఉండాలని పిలుపునిస్తూ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ లేఖలు రాశారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అన్నట్లు పరిస్థితి మారుతోందని .. అందుకే అందరూ కలసికట్టుగా ఉండాలని జగన్ లేఖలో కోరారు. ఈ లేఖ జగన్ రాయడానికి కారణం.. ఏపీ సర్కార్ పిలిచిన వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్లకు.. ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడం. ఏపీ సహా 9 రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా..ఒక్క బిడ్ కూడా రాలేదని జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎంలంతా ఒకటే వాయిస్‌తో ఉండి.. వ్యాక్సిన్ లభ్యతలో ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రులను కోరారు. గ్లోబల్ టెండర్లు ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు… వ్యాక్సిన్ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ఆందోళన ఉంది. కేంద్రం వ్యాక్సిన్ విధానంపై చాలా మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులు స్పందించారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా… ఇంతకు ముందే జగన్‌కు కూడా లేఖ రాశారు. జగన్‌తో పాటు పదకొండు మందిసీఎంలకు లేఖలు రాశారు. ఈ లేఖలకు సీఎం జగన్ స్పందించారో లేదో క్లారిటీ లేదు. అలాగే.. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌కు కూడా ఓ లేఖ రాశారు. అయితే ఆయన .. ప్రధాని మోదీకి సహకరించాలన్నట్లుగా ఆయన లేఖ రాశారు. ఇప్పుడు లేఖల విషయంలో సీఎం జగన్ వంతు వచ్చింది. బీజేపీయేతర ముఖ్యమంత్రులకే లేఖ రాస్తే.. వ్య.తిరేక భావనలు వస్తాయనుకున్నారేమో కానీ.. బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా కాపీలు పంపించారు.
నిజానికి గ్లోబల్ టెండర్లకు ఎలాంటి స్పందన రాదని.. వ్యాక్సిన్ వ్యవహారాలపై కనీస అవగాహన ఉన్న వారు మొదటి నుంచి చెబుతున్నారు. కేంద్రం అనుమతి ఇచ్చిన వ్యాక్సిన్లు ఇప్పటి వరకు మూడే ఉన్నాయి. అవి కాకుండా బయట నుంచి వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి పర్మిషన్ లేదు. ఈ విషయం తెలిసి కూడా.. సీఎం జగన్ గ్లోబల్ టెండర్లు పిలిచారు. నిజానికి దేశంలో టీకాలు సరఫరా చేస్తున్న కంపెనీలకే ఆర్డర్ పెట్టలేదని.. సీఎం జగన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు.. టెండర్లు వేయలేదని.. కేంద్రంపై అందరూ ఒకే వాయిస్ వినిపించాలని లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.
కొద్ది రోజుల కిందట… కరోనా సాయం.. టీకాల విషయంలోనే… మోడీపై విమర్శలు చేసినందుకు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై జగన్ విమర్శలు చేస్తూ రీ ట్వీట్ చేశారు. ఇప్పుడు మోడీపై అందరం ఒకే వాయిస్ వినిపిద్దామంటూ మిగతా సీఎంలను కలుపుకునే ప్రయత్నం చేశారు కానీ.. తాను కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనలేదు. జగన్ లేఖలపై ఎంత మంది సీఎంలు స్పందిస్తారో వేచి చూడాలి..!