చెప్పింది భారత్లో పోలీసులు కాదు మ్యానేజ్ చేశారని ఆరోపించి తుడిచేసుకోవడానికి..అమెరికా కోర్టు. అక్కడ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీతో లావాదేవీ పెట్టుకోవడంతో జగన్ రెడ్డిని నిండా ముంచేసింది. ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి అదానీ కేసులో లంచాలు తీసుకున్నట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చి స్పష్టంగా కోర్టులో కేసు పైల్ చేశాయి. ఇందులో చాలా స్ఫష్టంగా సెకీ ఒప్పందంలో 7,000 మెగా వాట్లకు గాను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెగావాట్ కు 25 లక్షల రూపాయల చొప్పున 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడని పేర్కొన్నాయి.
సెకీ విద్యుత్ ఒప్పందం ప్రజలకు భారమని మీడియా ఎన్నో సార్లు ఆరోపణలు చేసింది. ఆ డీల్ లో ఎన్నో లోపాలను బయట పెట్టాయి. కానీ జగన్ రెడ్డి మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఒప్పందాలు చేసేసుకున్నారు. రూ. 1750 కోట్లు లంచాలు పట్టేశారు. మామూలుగా అయితే అదానీతో డీలింగ్స్ అంటే ఇండియాలో ఎవరూ కనిపెట్టలేరన్న నమ్మకం కావొచ్చు..కానీ అమెరికా కోర్టు బయట పెట్టింది. ఈ ఆరోపణలు అవాస్తవాలని ప్రతి దొరికిన దొంగ చెప్పినట్లుగానే చెబుతారు. కానీ అమెరికా కోర్టుకు అంత అవసరం ఏముందో సామాన్య జనానికి వచ్చే డౌట్ ను ఎవరు తీరుస్తారు.
సీఎంగా లేనప్పుడే జగన్ రెడ్డి ఏపీని లూఠీ చేసి పెట్టారు. క్విడ్ ప్రో కో పేరుతో ప్రభుత్వ ఆస్తుల్ని సొంత ఆస్తుల్లాగా అమ్ముకున్నారు. కేసుల పాలయ్యారు. మన దేశ కోర్టుల్లో విచారణ సంస్థలు ఇలాంటి విషయాలతో నేరుగా కేసులు పెడితే పన్నెండేళ్లకుపైగా బెయిల్ మీద ఉన్నారు జగన్. ఇప్పుడు అమెరికా కోర్టులోనే దొరికిపోయారు. కేంద్రం సీరియస్గా దృష్టి పెడితే జగన్ రెడ్డిపై అత్యంత సీరియస్ కేసులు నమోదవుతాయి. మరి కేంద్రం రెడీగా ఉందా అన్నదే సందేహం.