వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. మాములుగా అయితే ఆయన ప్యాలెస్ లో ఉంటే బిల్లులు రావాల్సిన వాళ్లు వచ్చి .. సార్ మా బిల్లులు అనే వాళ్లు. మన ప్రభుత్వం పోయింది కదా.. ఇంకో మూడేళ్లు కళ్ళు మూసుకోండి.. ఆ తర్వాత బిల్లులే బిల్లులు అని సర్ది చెప్పి పంపేవారు. అయితే ఇప్పుడు ఆయన పొలాల్లో పర్యటించారు. పులివెందులలో అరటి తోటలకు అకాల వర్షాల వల్ల నష్టం జరిగింది. రైతుల్ని పరామర్శించేందుకు రాత్రికి రాత్రి వచ్చేశారు.
అకాల వర్షాల వల్ల పంట నెలకొరిగిన చోట పర్యటించారు. తనదైన పద్దతిలో ఓదార్పు చేశారు. రైతులకు ఇన్ పుడ్ సబ్సిడీ పెంచాలా అని ఓ చోట అడిగారు. అయితే వైసీపీ హయాంలో పాతిక వేలు ఉంటే.. ఇప్పుడు ముఫ్పై ఐదు వేలు అయిందని అధికారులు చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. రైతులతో రొటీన్ డైలాగ్ చెప్పారు. మరో మూడేళ్లు కళ్లు మూసుకుంటే చాలు మన ప్రభుత్వం వస్తుందని చెప్పుకొచ్చారు.
అయితే కడప జిల్లాలో జగన్ పర్యటనపై సెటైర్లు పేలుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్యాం కొట్టుకుపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. వారం రోజుల తర్వాత వచ్చి బారీకేడ్ల మధ్య బాధితుల్ని పరామర్శించి.. అన్నీ తనకు వదిలేయాలన్నారు. ఆయన కూడా వదిలేశారు.సీఎంగా ఉన్నప్పుడు కనీసం బాదితుల్ని పరామర్శించడానికి కూడా బయటకు రాని ఆయన ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రం ఏదైనా కష్టం వచ్చిందంటే పరుగులు పెట్టుకుంటూ వస్తున్నానన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. కానీ ఆయన ఐదేళ్ల పాటు చేసిన పని ఏంటో.. ఆయన పనితనం ఎంటో ప్రజలు అంత త్వరగా మర్చిపోయే అవకాశం లేదు.