వైఎస్ కొండారెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు. బీజేపీ పెద్దల బంధువుల కాంట్రాక్ట్ కంపెనీని కమిషనర్ల కోసం బెదిరించడంతో ఆయన అరెస్టయ్యారు. ఢిల్లీ నుంచి ఒత్తిడి రావడంతో ఆయనను అరెస్ట్ చేయక తప్పలేదు. మరో వైపు అధికారంలో ఉండి కూడా కుటుంబసభ్యులను కూడా అరెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితిపై కుటుంబంలోనే చర్చలు ప్రారంభమయ్యాయంటున్నారు. ఇప్పటికే తల్లి తరపు బంధువులు దూరమవుతున్న తరుణంలో కొండారెడ్డి అరెస్ట్ మరింత దూరం పెంచే ప్రమాదం కనిపించింది.
అయితే ఆయనను విడుదల చేస్తే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమో అన్న కారణంగా ఆలోచించారు. చివరికి .. ఆయనకు బెయిల్ ఇప్పించిజిల్లా నుంచి బహిష్కరిస్తే బెటరన్న అభిప్రాయానికి వచ్చారు. కొన్నాళ్లు ఆయన జిల్లాలో ఉండకపోతే.. లేకపోతే.. ఉండనట్లుగా ఆదేశాలు సృష్టిస్తే చాలనుకున్నారు. ఆ ప్రకారం ఆయనకు బెయిల్ వచ్చిన గంటలోనే రాయచోటి జైలు నుంచి విడుదలయ్యారు. కాసేపటికే ఎస్పీ ఆయనపై జిల్లా బహిష్కరణ వేటు వేయాలని ఎస్పీ సిఫారసు చేసినట్లుగా బయటకు తెలిసింది. ముఖ్యమంత్రి బంధువుపై ఎస్పీ ఇంత కఠిన నిర్ణయం తీసుకోరని.. పై స్థాయి నుంచి ఆదేశాలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు .
కొండారెడ్డిపై ఆధారాల్లేని కేసులు పెట్టలేదు. రాజకీయ కక్ష సాధింపు అసలే కాదు. పక్కా ఆధారాలతో ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడి మేరకే కేసు పెట్టారు. అయినా ఆయనకు బెయిల్ రావడానికి పూర్తి స్థాయిలో సహకారం అందింది. ఇదంతా ఆయనను జైల్లో పెట్టకుండా బయటే ఉంచడానికన్న అభిప్రాయం వినిపిస్తోంది.