వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన దాదాపుగా రూ. ఇరవై ఏడు కోట్లు పెట్టి.. ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్‌లో అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. తన తండ్రికి తన సొంత ఖర్చుతో ఈ మెమెరియల్ నిర్మించడం లేదు. ప్రజల సొమ్ముతో నిర్మిస్తున్నారు. రూ. ఇరవై ఏడు కోట్లు.. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ను ఖననం చేసిన ఘాట్ వద్ద… స్మారక నిర్మాణాను చేపట్టడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. శరవేగంగా..వీలైనంత త్వరగా.. ఈ స్మారక నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కడప జిల్లా పర్యటనకు జగన్ ఇరవై మూడో తేదీన వెళ్లారు. అదే రోజున ఈ ఇరవై ఏడు కోట్ల ప్రజాధనాన్ని వైఎస్ కు జ్ఞాపకంగా విడుదల చేశారు.
అయితే.. ఈ సొమ్మును ఏ డిపార్ట్మెంట్ ఖాతాలో వేయాలో బాగా ఆలోచించి.. చివరికి టూరిజం శాఖకు చాన్సిచ్చారు. ఇడుపుల పాయలో.. ఏదో…ప్రజలు వెల్లువలా వచ్చే… టూరిజం స్పాట్ ఉందన్నట్లుగా..దాన్ని అభివృద్ధి చేయడానికే కోట్లకు కోట్లు కేటాయిస్తున్నట్లుగా జీవో విడుదల చేశారు. నిజానికి ఇడుపులపాయలో వైఎస్ హయాంలో అసైన్డ్ ల్యాండ్స్‌ను ఆక్రమించుకున్నట్లు తేలడంతో.. వాటిని ప్రభుత్వానికి ఇచ్చారు. ఇచ్చినట్లే ఇచ్చి.. వాటిని త్రిపుల్ ఐటీ ఏర్పాటుకు కేటాయించారు. అక్కడ ట్రిపుల్ ఐటీ నడుస్తోంది. దానికి వైఎస్ఆర్ నాలెడ్జ్ పార్క్ అని పేరు పెట్టి.. ఇప్పుడు..నిధులు విడుదల చేశారు. ఇడుపులపాయ అనేది అసలు టూరిజం స్పాట్ కాదు. అదో ప్రైవేటు స్థలం. వైఎస్ కుటుంబం ఆధీనంలో ఉన్న ఎస్టేట్ మాత్రమే. అక్కడ రూపాయి కూడా ప్రజాధనం వెచ్చించడానికి అవకాశం లేదు.
అలా చేయడం.. నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ..ప్రభుత్వం కానీ..అధికారులు కానీ.. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ప్రజాధనాన్ని కోట్లకు కోట్లు కేటాయిస్తూ.. జీవో జారీ చేసేశారు. జగనమోహన్ రెడ్డి.. తాడేపల్లిలోని తన ఇంటి కోసం ఇలా పదిహేడు కోట్లు విడుదల చేయించుకున్నారు. చివరికి విశాఖకు రాజధానిని మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ జీవోలను వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు… ఆ మొత్తానికి మరో పది కోట్లు కలిపి..తండ్రి స్మారకాన్ని తన ఎస్టేట్‌లో నిర్మించడానికి విడుదల చేయించుకున్నారు.