కేటీఆర్ కి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం లో కూడా షర్మిళ ఎద్దేవా రాజకీయం చేసారు. అయితే నెటిజన్ల నుండి దీనికి విమర్శలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
కేటీఆర్ కి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, “ కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు .. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపె హృదయాన్ని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే పట్టుదలను 54 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చిత్తశుద్ధిని, విద్యార్థులకు పూర్తి ఫీజ్ రిఎంబర్స్మెంట్ ఇచ్చె మనసుని ఇవ్వాలని కోరుకొంటున్నాను.” అని ట్వీట్ చేశారు.
అయితే దీనికి చాలా ఘాటు విమర్శలు వచ్చాయి. ఒక నెటిజన్ దీనికి స్పందిస్తూ, “ చంద్రప్రతాప్ రెడ్డి గారి మొదటి భార్య; అనిల్ శాస్త్రి గారి 2వ భార్య; వందలాది విద్యార్థుల ఆత్మబలిదానాలకు కారకులైన రాజశేఖర్ రెడ్డి కూతురు; 16 నెలల జైలుపక్షి జగన్ గారి చెల్లెలు; షర్మిళ గారికి ధన్యవాదాలు. పుట్టిన రోజు శుభాకాంక్షల కూడా రాజకీయాలు చేయడం దిగజారుడుతనం “ అని రాసారు.
మరి వీటికి షర్మిళ ఎలా స్పందిస్తారో చూడాలి.