వివేకానందరెడ్డి హత్య కేసులో బెయిల్ పై ఉన్న అవినాష్ రెడ్డి సాక్షుల్ని తీవ్రంగా బెదిరిస్తున్నారని షర్మిల అంటున్నారు. తాాజాగా అవినాష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దర్యాప్తు అధికారిని బెదిరించి మరీ… సీబీఐ అధికారులపై తప్పుడు కేసులకు సంతకాలు పెట్టించారన్నారు. సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు. ఈ కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారని.. సునీతను ఏమైనా చేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ఇంకా విచారణ జరుగుతోందని.. ఆయన యథేచ్చగా బయట తిరగడం వల్లనే న్యాయం జరగడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తనకు కొన్ని విషయాలు తెలిశాయన్నారు. అవినాశ్ బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పలు విషయాలను పేర్కొందని షర్మిల తెలిపారు. విచారణ అధికారులను అవినాశ్ పిలిపించుకుని బెదిరించినట్టు అఫిడవిట్ లో ఉందని… తప్పుడు రిపోర్టుపై అధికారులతో అవినాశ్ సంతకాలు చేయించినట్టు ఉందని గుర్తు చేశారు.
వివేకాను సునీత, ఆమె భర్త చంపించినట్టు తప్పుడు రిపోర్టు ఇచ్చారని తెలిపారు. హత్య జరిగినప్పుడు ఘటనాస్థలిలో ఉన్నది అవవినాశ్ రెడ్డేనని గుర్తు చేశారు. కొద్ది రోజులుగా ఆమె వివేకా హత్య కేసు విషయంలో ఏమీ మాట్లాడటం లేదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా వివేకా హత్య కేసులో పెద్దగా పురోగతి లేదు. సీబీఐ అధికారిపై పెట్టిన తప్పుడు కేసు విచారణ నివేదికను సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించారు. ఇక సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.