జగన్మోహన్ రెడ్డిని వీలైనంత త్వరగా అరెస్టు చేయించాలని షర్మిల గట్టి పట్టుదలగా ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి ఆమె ఏ మాత్రం మొహమాట పడటం లేదు. గనుల శాఖలో దోపిడీని తన చేతుల మీదుగా నడిపించిన వెంకటరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంపై షర్మిల భిన్నంగా స్పందించారు. పిత్తపరిగలను ఇంకా ఎంతకాలం అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. పిత్తపరిగలు అంటే చిన్న చిన్న వ్యక్తులు అని ఆమె అర్థం. వారంతా పావులేనని అసలు దోపిడి దారుడు ఏ ప్యాలెస్ లో ఉన్నా సరే పట్టుకొచ్చి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ప్యాలెస్ అంటేనే.. ఎవరిని ఉద్దేశించి ఆమె అన్నారో అర్థం చేసుకోవచ్చు.
అధికారి వందల కోట్లు దోచుకుంటే వెనకున్న వాళ్ల దోపిడీ ఎంత ఉంటుందో ఊహించుకో… ఆ వ్యక్తి ఎవరు ప్రజలకు బాగా తెలుసని కూడా హింట్ ఇచ్చారు. తెరవెనుక ఉండి, సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 5 ఏళ్లుగా అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. టెండర్లు,ఒప్పందాలు,APMMC నిబంధనలన్ని బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని.. ఈ భారీ దోపిడీపై ఒక్క ఏసీబీ విచారణ మాత్రమే సరిపోదన్న షర్మిల… సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
షర్మిలకు ఏపీలో మైనింగ్ బిజినెస్ ఉండేదని జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక దాన్ని నిలుపుదల చేయించారని.. ఆమె ఆదాయ వనరులపై దెబ్బకొట్టారని గతంలో ఆంద్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓ వీకెండ్ కామెంట్ లో ప్రకటించారు. ఈ వెంకటరెడ్డి ఆ విషయంలో కీలక పాత్ర పోషించారేమో కానీ.. ఒక్కసారిగా తన ఆగ్రహాన్నంతా వెళ్లగక్కేశారు. ఏదో ఓ కేసులో జగన్ ను అరెస్టు చేస్తే ముందుగా సమర్థింపు ప్రకటన ష్రమిల నుంచే వస్తుందని సెటైర్లు ఏపీలో వినిపిస్తున్నాయి.