జగన్ , షర్మిల మధ్య ఆస్తుల పంచాయతీ ముదురుతోంది. సాక్షిలో ఆస్తులపై జగన్ వెర్షన్ రాయించారు. దానికి షర్మిల కౌంటర్ ఇచ్చారు. దానికి జగన్ కోపగించుకుని తన చెల్లిపై విమర్శలు చేయాలని ఆదేశాలిచ్చారు. సుబ్బారెడ్డికి కూడా అదే చెప్పారు. దాంతో సుబ్బారెడ్డి ప్రెస్మీట్ పెట్టి అసలు అక్రమంగా సంపాదించుకుని జైలుకు పోయింది జగనని.. షర్మిలకు ఆస్తులు ఎలా వస్తాయని గొప్ప సమర్థ వాదన చేశారు. అయితే సుబ్బారెడ్డి మరి భారతి పేరు మీద ఆస్తులున్నాయి కదా ఆమె ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టిన షర్మిల జగన్ కోసం ఎంతో చేశానని కానీ జగన్ తన చెల్లి కోసం ఏమీ చేయలేదని పైగా ఆస్తుల విషయంలో మోసం చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేశానన్నారు. పాదయాత్రలు చేశామని ఏ పని చెబితే ఆ పని చేశానన్నారు. మరి జగన్ తన కోసం ఏం చే్శాో చెప్పాలని అడిగారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి గురించి తల్లికి తెలియాలనే తన లేఖలో వారి పేరు పెట్టానన్నారు. ఆస్తుల విషయంలో జగన్ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. ఎవరైనా గిఫ్ట్ డీడ్ చేయాలనుకుంటే ఎంవోయూ చేస్తారా అని ప్రశ్నించారు. తనకు రావాల్సినవి ఇవ్వడానికి మాత్రమే ఎంవోయూ చేశారని దానిలో భాగంగా వచ్చిన డివిడెండ్లు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు.
తనకు లాభం కలిగితే తప్ప జగన్ ఎవరికీ మేలు చేయడన్నారు. ఇలాంటి వ్యక్తి మీకు నాయకుడో శాడిస్టో అర్థం చేసుకోవాలని పార్ట శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు కన్నతల్లిని కోర్టుకు లాగడమే కాకండా.. ఘర్ ఘర్ కీ కహానీ అంటున్నారని మండిపడ్డారు. షర్మిల తన తల్లి గురించి. జగన్ చేసిన మోసం గురించి చెబుతున్న సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు. గొంతులో నుంచి మాటలు రాలేదు.