చంద్రబాబు ఢిల్లీ పర్యటనలకు వెళ్తున్నారు కానీ రాష్ట్రానికి ఏమీ తేవడం లేదని షర్మిల విమర్శలు ప్రారంభించారు. నెలలో నాలుగు సార్లు వెళ్లారు కానీ రాష్ట్రానికి ఒక్క గుడ్ న్యూస్ కూడా తేలేదన్నారు. ఇందుకు కేంద్రానికి తల వంచుతారని ప్రశ్నించారు. “ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటక బోడి మల్లన్న “. ఇదే బీజేపీ సిద్ధాంతం.. చంద్రబాబు తెలుసకోవాలని కూడా సలహాలిచ్చారు.
అయితే చంద్రబాబు కొద్ది రోజుల పర్యటనలోనే ఏపీకి చాలా వచ్చాయని బయట ప్రచారం జరుగుతోంది. మచిలీపపట్నం బీపీఎఎల్ రిఫైనరీ దగ్గర నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వరకూ వేల కోట్లు విలవైన ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయి. అదే సమయంలో బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకమైన కేటాయింపులు ఉండబోతున్నాయని చెబుతున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని.. కేంద్రమంత్రి కుమారస్వామి ప్రకటించారు. వీటన్నింటిని షర్మిల పట్టించుకోవడం లేదు. చంద్రబాబు తనతో పాటు రాష్ట్రానికి డబ్బులు తేచ్చారా లేదా అన్నదే ముఖ్యమన్నట్లుగా మాట్లాడుతున్నారు.
నిజానికి షర్మిల ఆత్రం చూస్తూంటే.. చంద్రబాబును ప్రశ్నించాలని కాదు కానీ.. ముందుగా తానే ప్రశ్నించానని..తానే ప్రతిపక్షంలో ఉన్నానని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎవరికైనా అనిపించినా తప్పేం కాదు. ఎందుకంటే షర్మిల అదే చేస్తున్నారు. వైసీపీ నేతలు ఇప్పుడు స్పందించే పరిస్థితుల్లో లేరు. అందుకే ఆ స్పేస్ ను తాను భర్తీ చేయడానికి షర్మిల ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఆ ప్రయత్నంలో కాస్త ముందే విమర్శలు చేసేస్తున్నారు.