బిర్యానీ పెడతాం అంటే అన్నం పెట్టడం ఆపేయబోతున్నారని ప్రచారం చేసే వైసీపీ మార్క్ ఫేక్ నెరేటివ్స్ ఊబిలో షర్మిల కూడా చిక్కుకుంటున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని కేంద్ర ప్రభుత్వ పథకం.. ఆయుష్మాన్ భవను అందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. వెంటనే వైసీపీ సోషల్ మీడియాలో ఏపీలో ఆరోగ్యశ్రీ రద్దు అనే ప్రచారం ప్రారంభించింది. వీళ్ల ఆత్రం ఇలా ఉందని టీడీపీ సోషల్ మీడియా నిజాన్ని చెప్పేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే.. షర్మిల కూడా రంగంలోకి దిగిపోయారు.
పెమ్మసాని చెప్పిన దాంట్లో ఏదో అర్థం ఉందని.. క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా స్పందించారు. కేంద్రం పథకాల్ని సమర్థంగా వాడుకోవడం అంటే రాష్ట్ర పథకాన్ని ఆపేయడమా అని ప్రశ్నించారు. కేంద్రం ఆయుష్మాన్ భవ పథకాన్ని కూడా ఉపయోగించుకుంటే చాలా మందికి మేలు జరుగుతుందని.. ఏపీ ఆరోగ్యశ్రీ పథకం కొనసాగుతుందని.. అదనపు వైద్య సేవలు అందినట్లే కదా అని క్లారిటీ ఇచ్చారు. ఈ మాత్రం క్లారిటీ పెమ్మసాని మాట్లాడిన మాటలను చూస్తే ఎవరికైనా వస్తుంది.
కానీ ఏదో ఒకటి రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ ఫేక్ నేరేటివ్స్ ప్రారంభిస్తే దాన్ని షర్మిల అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కు సోషల్ మీడియా బలం కొరత ఉండవచ్చు కానీ.. వైసీపీ సోషల్ మీడియాను వాడుకుంటే మాత్రం.. ఫేక్ న్యూస్ లతో బద్నాం అయిపోతారు. ప్రజల్లో చులకన అయిపోతారని కాంగ్రెస్ లోనే సెటైర్లు పడుతున్నాయి. వైసీపీకి, షర్మిలకు తేడా ఏముందనుకునే పరిస్థితి వస్తుంది.