ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నారు. ఆ జిల్లాలో పాదయాత్ర చేస్తూ నియోజకవర్గం మొత్తంపై అవగాహన తెచ్చుకున్నారు. ఎక్కడికకక్కడ పార్టీ నేతల్ని నియమించారు. పాలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం నాయకులదే ఆధిపత్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి గెలుపొందారు.
గిరిజన ఓటు బ్యాంకు అధికంగా ఉండడం.. ఆయా గ్రామ రాజకీయాలు రెడ్డి సామాజికవర్గం నేతల చేతిలో ఉంటాయి. గిరిజనుల్లో మత మార్పిడి కారణంగా.. రెడ్లలో సామాజికవర్గ పరంగా తనకు అనుకూలంగా ఉంటుందని షర్మిల భావిస్తున్నారు. కాంగ్రె్‌సకు బలమైన నాయకుడు లేకపోవడం లాంటి అంశాలు తమకు కలిసొస్తాయన్న ఉద్దేశంతో షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
గతంలో షర్మిల పాలేరు నుంచి చేస్తానని ప్రకటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలానో…తనకు ఖమ్మం జిల్లా పాలేరు అలాంటిదని ప్రకటించేశారు. అక్కడి కొంత మంది కీలక నేతలకు కండువాలు కప్పే ప్రయత్నం చేశారు. తాను పాలేరు నుంచే రాజకీయ రంగంలోకి దిగుతానని .. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో మన ప్రభంజనాన్ని ఆపలేరని అక్కడి నేతలకు షర్మిల చెబుతున్నారు. పాలేరు నుంచి ఏ పార్టీ తరపున అయిన తుమ్మల నాగేశ్వరరావు, సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఇద్దరూ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వీరితో షర్మిల పోటీ పడాల్సి ఉంది.