వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి… వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ గొడలితో నరికేయాలి. వాళ్లే సింగిల్ ప్లేయర్‌గా ఉండాలి .. ఇదే భారతీ రెడ్డి స్ట్రాటజీ అంటూ విమర్శలు చేశారు. గొడ్డలితో అందర్నీ నరికేస్తే ఎవరూ పోటీ చేయరని అప్పడు సింగిల్ ప్లేయర్‌గా ఉండొచ్చని సలహా ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత విదేశాలకు పారిపోవడానికి అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. పాస్‌పోర్టులు రెడీ చేసుకున్నారని అన్నారు. ఓడిపోయిన తర్వాత నడుస్తున్న కేసుల్లో అరెస్టు తప్పదని వాళ్లందరికి తెలుసు అన్నారు. అందుకే ఆ అరెస్టు నుంచి తప్పించుకోవాలనే ఆలోచనతో ఉన్నారని విదేశాలకు పారిపోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు.
సాక్షి పత్రికలో ప్రతీ రోజూ షర్మిల, సునీత వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా పేజీలకు పేజీలు రాస్తున్నారు. దీనిపై షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో షర్మిలకు రాజకీయాలు చేయకూడదని .. తాను మాత్రమే చేయాలని జాతీయ మీడియాలకు ఇంటర్యూలు ఇచ్చారు. షర్మిల రాజకీయం చేయడం చాలా పెద్ద తప్పు అన్నట్లుగా ప్రకటనలు చేశారు. ఓ వైపు తన రాజకీయాన్ని కించ పర్చడం.. తప్పుడు కథనాలు రాయించడం.. మరో వైపు తాను రాజకీయం చేయడం తప్పన్నట్లుగా మాట్లాడటం వంటి వ్యవహారాలతో షర్మిల తీవ్ర అసహనానికి గురయ్యారు. అదే సమయంలో బద్వేలులో ఆమెపై కేసు కూడా పెట్టించారు.
వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో హత్య చేశారు. ఆ కోణంలోనే ఈ విమర్శలు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వివేకానందరెడ్డి సీటు అడిగారని చంపేశారని.. అలాగే అందర్నీ చంపేసి సింగిల్ ప్లేయర్ గా ఉండమని సలహా ఇచ్చారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అంతమొందించడం అనేది.. వైసీపీ అధినేత జగన్ స్ట్రాటజీల్లో ఒకటని ఎప్పట్నుంచో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో షర్మిల ఆరోపణలు సహజంగానే పెను ప్రకంపనలు రేపుతాయి.