షర్మిల అసహనానికి గురయ్యారు. తనపై సాక్షి పత్రికలు పుంఖానుపుంఖాలుగా రాయిస్తున్న తప్పుడు కథనాలపై ఆమె ఫైరయ్యారు. సాక్షిలో జగన్ రెడ్డికి ఎంత వాటా ఉందో తనకూ అంతే ఉందని స్పష్టం చేశారు. కడప జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన షర్మిల తనపై వైసీపీ నేతలు మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారంపై మండిపడ్డారు. రోజుకో జోకర్ ను తెస్తున్నారు. నాపై నిందలు వేపిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి నేనన్నారు.
జగన్ అన్న అప్పటి మనిషి కాదని.. ఇప్పటి జగన్ అన్న ను ఎప్పుడు చూడలేదని మండిపడ్డాారు. నా మీద స్టోరీలు అల్లుతున్నారు… రోజుకో జోకర్ ను తెస్తున్నారు . నా మీద బురద చల్లుతున్నారు. నిన్న ఒక జోకర్ తో ప్రణబ్ ముఖర్జీ చెప్పాడట.. జగన్ జైల్లో ఉన్నప్పుడు..నా భర్త అనిల్ సోనియా ను కలిశారట.. జగన్ ను బయటకు రానివ్వద్దు అని లాబియింగ్ చేశామట .. ఇప్పుడు చెప్పడానికి ప్రణబ్ లేడు .. ఒక పెద్ద మనిషి పేరును కూడా మీరు వదలడం లేదు. మీ కుట్రలకు అంతే లేదు అని మండిపడ్డారు.
తనకు పదవి ఆకాంక్ష ఉంటే…నాన్న ను అడిగి తీసుకోనా ? వైసీపీ లో నైనా పదవి తీసుకోనా ? అనిల్ , భారతి రెడ్డి తో కలిసి సోనియా వద్దకు వెళ్ళారని గుర్తు చేశారు. భారతి కి తెలియకుండా సోనియా ను అడిగారా అని ప్రశ్నించారు. భారతి రెడ్డి లేనప్పుడు అడిగారా ? కనీసం ప్రణబ్ ముఖర్జీ కూడా ఎక్కడ చెప్పినట్లు రికార్డ్ కూడా లేదు. తెలంగాణ లో నాతో కలిసి పని చేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తోంది.. తన పై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారని మండిపడ్డారు.
ఇదే సాక్షి సంస్థలో నాకు బాగం ఉంది.. సగం భాగం ఇచ్చారు వైఎస్సార్.. సగం భాగం ఉన్న నాపై నా సంస్థ బురద చల్లుతుందని మండిపడ్డారు. విలువలు ,విశ్వసనీయత లేకుండా దిగజారుతున్నారు.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడకు వచ్చానని.. – ప్రత్యేక హోదా వచ్చే వరకు. ఇక్కడ నుంచి కదలనని ..పోలవరం వచ్చే వరకు కదలనని.. ఏం పీక్కుంటారో… పీక్కోండని స్పష్టం చేశారు. షర్మిల ఆవేశం చూసి కాంగ్రెస్ నేతలు కూడా ఆశ్చర్యపోయారు.
నిజానికి సాక్షి పత్రికతో పాటు వైసీపీ నేతలు, ఆ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు సాక్షిలో కూర్చుని వండే వింత కథలకు అంతే ఉండదు. గతంలో విపక్ష నేతలు బలైపోయేవారు. ఇప్పుడు జగన్ రెడ్డి సొంత చెల్లిని టార్గెట్ చేసుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. సొంత చెల్లి కూడా కన్నీరు పెట్టుకునేలా సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తున్నారు జగన్ రెడ్డి.