మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ప్రాణభయంతో హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. కొన్ని రోజులుగా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన పైన, నా సోదరి షర్మిలపైన అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడు. తీవ్ర అభ్యంతరకరమైన, అసహ్యకరమైన రీతిలో పోస్టులు ఉంటున్నాయిని చంపుతానని బెదిరిస్తున్నారని చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ ప ోలీసులకు పిర్యాదు చేశారు.
పెడుతున్నాడు. వర్రా రవీంద్ర రెడ్డి పెట్టే పోస్టులు మా ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయి. జనవరి 29న నా సోదరి షర్మిలతో పాటు నేను ఇడుపులపాయ వెళ్లాను. అనంతరం వర్రా రవీందర్ రెడ్డి తన పేజీలో నన్ను చంపేయాలి అని అర్థం వచ్చేట్టు ఒక పోస్ట్ పెట్టాడు. ‘‘అందుకే పెద్దలు అన్నారు శత్రు శేషం ఉండకూడదు లేపేయ్ అన్నాయ్ ఇద్దరినీ ఈ ఎన్నికలకు పనికి వస్తారు’’ అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను. నాకు ప్రాణహాని ఉందని పోలీసులకు, సీబీఐ కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. వర్రా రవీంద్రారెడ్డి వైఎస్ భారతి పీఏగా చెబుతారు. ఆమెకు బంధువని అంటారు. భారతి తరపున పులివెందులలో వ్యవహారాలు చక్క బెడతారని అంటున్నరు.
చంపెయమని పోస్టులు పెట్టడం.. వివాదాస్పదమవుతోంది. నిజానికి ఈ వర్రా రెడ్డి అత్యంత జుగుప్సాకరమైన వ్యక్తి. భారతి రెడ్డిపై కూడా రాజకీయ ప్రత్యర్థులు అలాంటి పోస్టులు, ఆరోపణలు చేస్తారని తెలిసి కూడా అవే పోస్టులు పెడుతూంటారు. అయితే సైబర్ క్రైమ్ ఫిర్యాదు అందిందని డీఎస్పీ చెప్పారు కానీ కేసు నమోదు చేశారో లేదో చెప్పలేదు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటే.. కీలకమైన మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.