కడప ఎస్పీ హర్షవర్ధన్రాజును కలిశారు వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి. ఈ సందర్భంగా తన తండ్రి హత్య కేసుపై ఎస్పీతో చర్చించారు.
వైసీపీ హయాంలో తన తండ్రి హత్యకేసులో సీబీఐతోపాటు తమకు పోలీసులు ఏమాత్రం సహకరించలేదని ఎస్పీకి వివరించారు సునీత. స్థానిక పోలీసులు అంతా నిందితుల పక్షం వహించారని పలు విషయాలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.
Also Read : హోంమంత్రి వంగలపూడి అనితతో వైఎస్ సునీత భేటీ.. వివేకా కేసుపై చర్చ!
వివేకా కేసుపై హోంమంత్రి వంగలపూడి అనితను కలిసి చర్చించిన సునీత..ఆ తర్వాత కడప జిల్లా ఎస్పీని కలవడం గమనార్హం. వివేకా కేసులో నిందితులకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సునీత విజ్ఞప్తి పట్ల అనిత సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత ఎస్పీని కలిసి ఇదే విషయం ఆయనకూ వివరించారు.
వివేకా కేసు విచారణ సమయంలో స్థానిక పోలీసులు కేసును పూర్తిగా నీరుగార్చేలా వ్యవహరించారని సునీత తెలిపారు. నిందితులకు శిక్ష పడేలా పోలీసులు సహకరించాలని ఆమె కోరినట్లుగా తెలుస్తోంది.