వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత శుక్రవారం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ లో ప్రె శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. తెలుగుమీడియాతో పాటు జాతీయ మీడియాను కూడా ఆహ్వానించారు. తన తండ్రి హత్యకు సంబంధించిన కుట్రదరులెవరు అన్న అంశంపై కొన్ని కీలక విషయాలను.. కొన్ని డాక్యుమెంట్లను ఆమె బయట పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
తన తండ్రిని హత్య చేసిన నిందితులు, కుట్రదారులకు శిక్ష పడేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికి ఐదేళ్లు దాటిపోయినా ఆమె పోరాటం ఆగలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు ముందుకు సాగకపోవడంతో హైకోర్టుకు వెళ్లి.. సీబీఐ విచారణకు ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కుట్రదారులెవరో ఇంత వరకూ బయటపడలేదు. ఈ మధ్య కాలంలో ఎన్నో ట్విస్టులు ఈ కేసులో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సీబీఐ విచారణ కూడా ఆగిపోయింది.
తెలంగాణ హైకోర్టులో ఇదే అంశానికి సంబంధించి సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు మెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం సిబిఐ ముందు హాజరుకావాలని షరతు విధించింది. ఈ మేరకు ప్రతివారం అవినాష్ రెడ్డి సిబిఐ ముందు హాజరవుతున్నారు. అయితే ఇప్పుడు నర్రెడ్డి సునీతారెడ్డి ఎలాంటి విషయాలు ప్రెస్ మీట్లో బయట పెడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయంలో సునీతారెడ్డి బయట పెట్టబోయే అంశాలు సంచలనాత్మకం అయ్యే అవకాశం ఉంది.