వైఎస్ విజయలక్ష్మి అమెరికా వెళ్లిపోయారు. పెళ్లి చేసుకుని భాగస్వామితో కలిసి అమెరికా వెళ్లిపోయిన షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వద్ద ఎన్నికలయ్యే వరకూ ఉంటారు. ఆ తర్వాతే తిరిగి వచ్చే అవకాశం ఉంది. పదే పదే తన కోసం ప్రచారానికి రావాలని జగన్ వైపు నుంచి తీవ్ర ఒత్తిడి వస్తూండటంతో షర్మిలనే తన కుమారుడి వద్దకు అమెరికా వెళ్లిపోవాలని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు ఏర్పాట్లు చేసి పంపించారు.
ఆమె అమెరికా చేరుకున్న తర్వాతనే విషయం వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. విజయలక్ష్మి చాలా కాలంగా జగన్ తో పాటు ఉండటం లేదు. షర్మిలతోపాటే ఉంటున్నారు. విజయలక్ష్మి పుట్టిన రోజు నాడు.. చివరికి జగన్ పుట్టిన రోజు కూడా ఆమె జగన్ ఇంటికి వెళ్లడం లేదు. అయితే ఎన్నికల సమయం కావడంతో.. తల్లితో ప్రచారం చేయించుకోవాలని అనుకుంటున్నారు. ప్రచారం ప్రారంభం రోజున ఇడుపులపాయకు పిలిపించుకుని .. తల్లి మద్దతు తనకే ఉందన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు.
తర్వాత కూడా ప్రచారానికి రావాలని ఒత్తిడి చేస్తూండటంతో.. షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడలేక ఆమె దూరంగా వెళ్లాలని అనుకున్నారు. షర్మిల కూడా తల్లితో రాజకీయం చేయడం ఇష్టం లేక .. ఆమెను ఒత్తిడి గురి చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ప్రచారం అవసరం లేదని చెప్పారు. జగన్ నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకునేందుకు అమెరికా వెళ్లాలని సూచించారు. అదేదో బాగుండటంతో.. విజయలక్ష్మి అమెరికా వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.