వైఎస్ వివేకానందరెడ్డిని శారీరకంగా అత్యంత దారుణంగా చంపారు. చనిపోయిన తర్వాత కూడా ఆయనను రోజూ వ్యక్తిత్వ పరంగా మర్డర్ చేస్తూనే ఉన్నారు. ఆయన క్యారెక్టర్‌ను అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారు. చంపినా తప్పు లేదనే భావన కల్పించడానికో మరో కారణమో తెలియదు కానీ.. ఊహించనంత నిందలు వేస్తున్నారు. అయితే విచిత్రంగా ఇలాంటి నిందలు వేస్తున్నా.. అంత పెద్ద వైఎస్ కుటుంబం నుంచి ఒక్కరూ ఖండించడం లేదు.
వైఎస్ వివేకాను కీచకుడిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు ?
వైఎస్ కుటుంబంలో చాలా మందిపై రూమర్స్ ఉన్నాయి కానీ.. ఎలాంటి రూమర్స్ లేని క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు వివేకానందరెడ్డి. ఆయన చాలా మృదు స్వభావి అని అందరికీ తెలుసు. ఆయన నిజంగా అలాంటి వ్యక్తి కాదని… లోపల వేరే ఉందని.. అనుకుంటే.. గాసిప్స్ రూపంలోనైనా ఎప్పుడో బయటకు తెలిసేది. కానీ అలా కూడా ఎవరూ చెప్పుకోలేదు. కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆయనను కీచకుడిగా చెబుతున్నారు. హత్యకేసులో నిందితుల ఇళ్లలోని ఆడవాళ్లతో అక్రమ సంబంధాలు కలిపేస్తున్నారు. ఇది చూసే వాళ్లకు.. తెలుసుకునే వాళ్లకు …. ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది.
మంటగలుపుతోంది కుటుంబ పరువునే… అయినా ఎవరూ స్పందించరేంటి ?
సొంత కుటుంబసభ్యుడ్ని అత్యంత దారుణంగా చంపుకున్నారన్న ఓ ఇమేజ్ ఇప్పుడు వైఎస్ కుటుంబంపై ఉంది. దాన్ని ఎలాగోలా తుడిచేసుకోవడానికి ప్రయత్నించకుండా మళ్లీ ఆ చనిపోయిన వారిపై నిందలు.. న్యాయం కోసం పోరాడుతున్న సునీతపైనే ఆరోపణలు చేయడం .. సొంత కుటుంబాన్నే కించపర్చుకున్నట్లుగా అవుతోంది. ఇదేం ఫ్యామిలీ అని అందరూ అనుకునేలా చేస్తోంది. అయితే ఈ ఇష్యూపై ఇతరులు ఎవరూ మాట్లాడటం లేదు. తమ కుటుంబానికి ఈ దుర్గతి పట్టిందని.. దాన్ని సాల్వ్ చేసుకుందామని.. ప్రజల్లో పరపతి కాపాడుకుందామని అనుకోవడం లేదు.
చనిపోయిన వివేకా కోసం షర్మిల, విజయమ్మ కూడా మాట్లాడరా ?
చనిపోయిన వాళ్లు అందరూ మంచోళ్లే అంటారు. చంపపబడిన వాళ్లుకూడా చనిపోయిన వాళ్లే. ఆ చనిపోయిన వాళ్లు మంచిని గుర్తు చేసుకుని… వారి కోసం ప్రార్థిస్తారు. కానీ వైసీపీ పెద్దల ఫ్యామిలీలో ఒక్కరంటే ఒక్కరు కూడా వివేకానందరెడ్డిపై ఆలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదని చెప్పడం లేదు. చివరికి విజయమ్మ, షర్మిల కూడా నోరు మెదపడంలేదు. అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డి కోర్టుల్లో అఫిడవిట్లు దాఖలు చేస్తూ..కోర్టుల్లో చెబుతున్న కథలు.. వారిని కదిలించడం లేదు. ఈ వివాదంలో జోక్యం చేసుకోవడం ఎందుకు అని సైలెంట్ గా ఉంటున్నారేమో కానీ… ఇలా చేయడం వల్ల తమ కుటుంబ ప్రతిష్టను తాము తగ్గించుకుంటున్నామన్న సంగతిని మాత్రం గుర్తించలేకపోతున్నారుు.