జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయారు. చివరికి తన తల్లి సపోర్టును కోల్పోయారు. వైసీపీని ఓడించి తన కుమార్తె షర్మిలను గెలిపించాలని ఆమె అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు. విజయమ్మ ఎవరికి మద్దతుగా లేకండా సైలెంట్ గా ఉంటారని ఎక్కువ మంది అనుకున్నారు. కానీ పరిస్థితి మారిపోయింది. కుమారుడి బారి నుంచి షర్మిలను కాపాుకోవాలని అనుకున్నారేమో కాన రంగంలోకి దిగిపోయారు. తన కుమార్తెను గెలిపించాలని వీడియో రిలీజ్ చేశారు.
వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ చేసిన రాజకీయాల్లో విజమయ్మది కీలక పాత్ర. ఆమెకు ప్రత్యేకంగా రాజకీయ జ్ఞానం లేకపోయినప్పటికీ సానుభూతి రాజకీయాలకు ఆమె ముఖ్యం కాబట్టి అన్నింటికీ జగన్ ఆమెను ముందు పెట్టుకునేవారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా చేశారు. ఎమ్మెల్యేను చేసి అసెంబ్లీకి పంపి ఇతరులతో నానా మాటలు అనిపించారు. విజయమ్మను గరిష్టంగా ఉపయోగించుకుని సానుభూతి పొందిన జగన్ చివరికి ఆమెకు హ్యాండిచ్చారు. ఎంతలా అంటే కనీసం జగన్ ఇంటికి కూడా ఆమె చుట్టపు చూపుగా వెళ్లలేనంత పరిస్థితి ఏర్పడింది.
ప్రచారం ప్రారంభించేముందు ఇడుపులపాయకు రావాలని ఒత్తిడి చేయడంతో ఆమె వెళ్లారు. తర్వాత ఇక్కడే ఉంటే ప్రచారానికి కూడా రమ్మని బలవంతం చేస్తారని షర్మిల కుమారుడితో పాటు అమెరికా వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఇంకా ఎన్నో జరిగాయి. వైసీపీ సోషల్ మీడియా.. షర్మిలతో పాటు ఆమె తల్లి విజయమ్మపై వేస్తున్న నిందలు చూసి వారు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక తన కుమారుడ్ని ఉపేక్షిస్తే కష్టమని.. విజయమ్మ స్వయంగా రంగంలోకి దిగారు. వైసీపీని ఓడించి షర్మిలను గెలిపించాలని వీడియో విడుదల చేశారు.