బాబాయ్ వివేకానంరెడ్డిని పంపేసినట్లే తల్లి విజయమ్మను కూడా జగన్ రెడ్డి ప్లాన్డ్ గా పంపడానికి చేసిన కుట్ర ఫెయిలయిందని ఒకటో తేదీన టీడీపీ ఆరోపించింది. గతంలో కర్నూలు వెళ్లి వస్తున్నప్పుడు విజయమ్మ కొత్త వెల్ ఫైర్ కారు టైర్లు రెండు ఒక్క సారే పిలిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇలా పేలే అవకాశం లేదని టోయోటా కంపెనీ కూడా చెబుతోంది. అయితే ఎల జరిగిదో తెలియదు కానీ అప్పట్లోనే టీడీపీ నేతలు అనుమానంగా జగన్ వైపు చూశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అవే ఆరోపణలు చేస్తున్నారు.
తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నా విజయమ్మ సైలెంట్ గా ఉండటం జగన్ ను మరింత నొప్పించింది. విజయమ్మను చంపేందుకు కుమారుడు జగన్ ప్రయత్నించారని జనంలో చర్చించుకుటున్నారని ఇది ఎంత మాత్రం మంచిది కాదని కుమారుడితో ఆస్తుల వివాదం ఉంటే.. క్లారిటీ ఇచ్చారని.. మరి ఇలాంటి అంశంపై ఎందుకు క్లారిటీ ఇవ్వరని బంధువులతో జగన్ రాయబారం నడిపించినట్లుగా తెలుస్తోంది. టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలకు కౌంటర్ ఇవ్వాలని కోరడంతో.. తప్పనిసరిగా విజయమ్మ అంగీకరించినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రోజులకు ఈ ప్రయత్నాలు ఫలించడంతో ఇప్పుడీ లేఖ విడుదలయింది.
వైసీపీ సన్నిహిత మీడియాకు వైసీపీ వర్గాల నుంచే మొదటగా ఈ లేఖ రిలీజ్ అయింది. సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా విరవణ రాసి పంపితే.. విజయమ్మ సంతకం పెట్టారని అంటున్నారు. నిజానికి ఇలాంటి అనుమానాలను విజయమ్మ క్లారిటీ ఇస్తే.. పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ మరింత విస్తృతమైన చర్చ జరుగుతుదంి. విజయమ్మ లేఖతో మరోసారఆ ఘటనపై చర్చ జరిగే అవకాశం ఉంది.