వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనంతపురం జిల్లాకు వెళ్లిన ఆమె తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పేలింది. డ్రైవర్ అత్యంత చాకచక్యంగా కారును నియంత్రించారు. పల్టీలు కొట్టకుండా చూసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
విజయమ్మకు ప్రమాదం జరిగిన కారుకు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కాలేదు. టోయోటా వెల్లిఫైర్ కారుగా భావిస్తున్నారు. ఇలాంటి కార్లకు సూపర్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఇంకా విశేషం ఏమిటంటే..టైర్లు పేలివడం అనే సమస్యలు ఇలాంటి కార్లకు రావు. పూర్తి స్థాయిలో అన్ని రకాల టెస్టులు పూర్తి చేసిన తర్వాతే డెలివరీ ఇస్తారు. సాధారణంగా టైర్లు పూర్తిగా అరిగిపోయినప్పుడో… తీవ్రమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడో ఒత్తిడి పెరిగిపోయి సహజంగా టైర్లు పేలిపోతూ ఉంటాయి. కానీ విజయమ్మ కారు టైర్లు మాత్రం ఊరకనే పేలిపోయాయి.
ఇటీవలే వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసిన విజయమ్మ ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారు. కుమార్తె రాజకీయ పార్టీ వ్యవహారాల్లో తెర వెనుక పనులు చక్క బెడుతున్నారు. తన కుమార్తెకు తన అవసరం చాలా ఉందని చెబుతు న్నారు. వైఎసఆర్ ఆత్మీయులు.. అలాగే.. బంధువులు ఎవరైనా ఫంక్షన్లకు పిలిస్తే వెళ్లి వస్తున్నారు. ఆమెకు ప్రత్యేకంగా కాన్వాయ్ లేకపోవడం.. ఒక్కటే కారు ఉండటంతో స్థానికులు ఏర్పాటు చేసిన కారులో హైదరాబాద్ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.