జగన్ రెడ్డి కక్కుర్తిని .. ఆస్తుల కోసం సొంత చెల్లిని మోసం చేయాలనుకున్న వైనాన్ని వైఎస్ విజయలక్ష్మి బహిరంగ లేఖ ద్వారా బయట పెట్టారు. షర్మిలపై ఏకపక్షంగా జరుగుతున్న ఎటాక్ ను తట్టుకోలేక నిజాలు చెబుతున్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు. అసలు ఆస్తుల విభజన చేద్దామని ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకు జగన్ రెడ్డినే ప్రతిపాదన పెట్టారని.. ఎంవోయూ కూడా ఆయనే చేశారని విజయమ్మ స్పష్టం చేశారు. జగన్ రెడ్డి చెబతున్నవి..విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని కుటుంబ బంధువులుగా వారు ఎంవోయూపై సంతకాలు చేసి అబద్దాలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
MOU ప్రకారం జగన్ 60 శాతం.. పాపకు 40 శాతం అయితే, MOU కు ముందు సగం సగం డివిడెండ్ తీసుకొనే వారని విజయలక్ష్మి గుర్తు చేసుకున్నారు. MOU లో పాపకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదు. జగన్ భాధ్యత గా ఇస్తున్నవి. అటాచ్ మెంట్ లో లేవు కాబట్టి, MOU లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, MOU లో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం, పాపకు వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడని విజయమ్మ స్పష్టం చేశారు. ఇవి కూడా ఇవ్వకుండ.. ఆటాచ్ మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా పాపకు అన్యాయం జరిగిందని లేఖలో విజయమ్మ తెలిపింది.
షర్మిలమ్మ ను బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయలేదు. అయినా షర్మిలమ్మ పాలిటిక్స్ లో జగన్ చెప్పినట్లు చేసింది. జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. జగన్ అధికారంలో రావడానికి పాప కృషి ఎంతో ఉందని అయినా జగన్ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే, చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా, అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి, నా ధర్మం అందుకే ఈ లేఖ రాస్తున్నాన్నారు.
జగన్ రెడ్డి ఎంత ఘోరమైన వ్యక్తో ఈ లేఖ ద్వారా తెలిసిపోయింది. సొంత తల్లి కూడా జగన్ క్యారెక్టర్ ను బయటపెట్టిందంటే ఇక జగన్ ఏమని తన వాదనను సమర్థించుకుంటారో చూడాల్సి ఉంది. ఆయన పులివెందులలో బుధవారం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.