వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదని.. వైఎస్ వివేకా హత్య కేసును.. స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని ఆ పిటిషన్ సారాంశం. దేశంలో ఇప్పుడు స్వతంత్ర దర్యాప్తులు సంస్థలు ఎక్కడ ఉన్నాయో.. జగన్మోహన్ రెడ్డికే తెలియాలి కానీ.. ఈ పిటిషన్ వేసిన విధానం… చూస్తే.. ఆయనేదో ఆందోళనకు గురవుతున్నారన్న అంశం మాత్రం స్పష్టంగా బయటపడుతోంది. ఇంతకీ ఆ ఆందోళన ఏమిటి..?
ఏపీ పోలీసుల దర్యాప్తుపై జగన్కు అంత భయం ఎందుకు..?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. ఆ హత్యను గుండెపోటుగా చిత్రీకరించాలనేది… వైఎస్ కుటుబీకుల మొదటి ప్రయత్నం. ఈ విషయంలో చేయాల్సినదంతా చేశారు. తప్పించుకోలేనంతగా చేశారు. అది గుండెపోటుగానే ఆస్పత్రి రికార్డుల్లో చేర్పించేసి… అంత్యక్రియలు చేసేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదేమో..?. కానీ చివరికి బయటపడింది. దాందో.. అసలు కేసు.. మొదట.. వైఎస్ కుటుంబం నుంచే ప్రారంభమవుతోంది. అంత దారుణమైన ఫ్యాక్షన్ హత్యలా… స్పష్టంగా కనిపిస్తున్నా.. ఎందుకు దాచేయాలనుకున్నారనేది.. పోలీసులను వేధిస్తున్న ప్రధానమైన ప్రశ్న. దీనికి సమాధానం రాబడుతూండటంతోనే… అన్నీ ఒక్కొక్కటికిగా చిక్కుముళ్లు వీడిపోతున్నాయి. బయట వాళ్లు చేస్తే… దీన్ని ఎలా వైసీపీ నేతలు ప్రొజెక్ట్ చేస్తారో అందరికీ తెలుసు… ఇంట్లో వాళ్లు చేశారు కాబట్టే… ఏమీ జరగనట్లు నాటకం ఆడారన్న అంశంపై క్లారిటీ ఉంది. ఇది బయటకు వస్తుందని.. జగన్ ఆందోళన చెందుతున్నారా..?
ఏ-1గా భారతి తండ్రి గంగిరెడ్డి అవబోతున్నారని అంచనాకు వచ్చారా..?
అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎలాగూ నిందితులవుతారు. కానీ.. అసలు సాక్ష్యాలను తుడిచేసే క్రమంలో కీలకంగా వ్యవహరించిన గంగిరెడ్డి ఇప్పుడు.. ఈ కేసులో ముందుగా ఏ-1 అయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే… జగన్మోహన్ రెడ్డి విశ్లేషణాత్మకంగా వివరించినట్లు… గొడ్డలితో ఇష్టం వచ్చినట్లు నరికిన మనిషికి.. ఆ గంగిరెడ్డి ఫస్ట్ ఎయిడ్ చేశారు. స్వయంగా డాక్టరైన ఆ గంగిరెడ్డి.. తన ఆస్పత్రి సిబ్బందిని పిలిపించి.. మృతదేహాంపై గాయాలు కనబడకుండా.. కట్లు కట్టించారు. రక్తం తుడిపించారు. సాధారణ మరణంగా భ్రమింపచేసేందుకు చేయాల్సినదంతా చేశారు. సాక్ష్యాలను మాయం చేసే విషయంలో.. గంగిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అందుకే.. ఇప్పుడు.. కేసులో గంగిరెడ్డి ఏ-1 అయ్యే చాన్స్ ఉంది. ఆయన ఇలా చేయడానికి తెర వెనుక బాగోతాలు ఏమైనా ఉన్నాయో లేవో విచారణలో తేలుతుంది. కానీ ఇప్పటికైతే ప్రధాన నిందితుడు అవడం ఖాయం. ఇంతకీ గంగిరెడ్డి ఎవరు..? వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి తండ్రి. ఈ ఎపిసోడ్లో ఆయన ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని… జగన్మోహన్ రెడ్డి కంగారు పడిపోయినట్లున్నారు. అందుకే బయటపడి.. భయపడి కోర్టుకెళ్లినట్లు కనిపిస్తోంది.
అసలు విచారణ అడిగే అర్హత జగన్కు ఉందా..?
అసలు వివేకా హత్యపై విచారణ స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని అడగడానికి జగన్మోహన్ రెడ్జి ఎవరు..?. చట్టం ప్రకారం… ఓ ప్రాసెస్ ఉంటుంది. మృతుని కుటుంబసభ్యులు వెళ్లాలి. జగన్మోహన్ రెడ్డికి ఆ వివేకానందరెడ్డి బాబాయ్ కావొచ్చు కానీ.. చట్టం దృష్టిలో కుటుంబం అంటే.. తల్లీ, తండ్రి, పిల్లలు మాత్రమే. తమకు పోలీసుల విచారణపై నమ్మకం లేకపోతే.. వివేకా కూతురు లేదా భార్య వెళ్లాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత కంగారు పడుతున్నారు…? అసలు ఏం జరిగిందో.. తెలిసి కూడా చెప్పడానికి వెనుకాడుతూ… పోలీసులపై ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..? . ఏపీ పోలీసుల దర్యాప్తుతో నిజాలు బయటకు వస్తే… ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భయపడుతున్నారా..?