వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పోలీసులు గుట్టుగా విచారణ జరుపుతున్నారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి… ఎవరి రాజకీయం వాళ్లు చేసుకుంటున్నారు. వీరు కాకుండా.. ఈ కేసులో హడావుడి చేస్తున్న మరో వ్యక్తి… వైఎస్ వివేకా కుమార్తె… సునీతారెడ్డి. ఆమె తీరు మొదటి నుంచి ఏదో తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లుగా ఉంది. తొలి రోజు… గుండెపోటుతో మరణించారన్న సమాచారాన్ని సాక్షి మీడియా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత… చివరికి అతి కష్టం మీద.. వివేకా పీఏ కృష్ణారెడ్డి కేసు నమోదు చేశారు. ఇలా చేయడం వెనుక.. హైదరాబాద్ నుంచి బయలు దేరిన.. వివేకా కుమార్తె సునీతా ఒత్తిడి ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ… ఆమె మాత్రం.. మాట మాటకీ.. మాటలు మార్చుకుంటూ వస్తున్నారు.
వివేకా హత్య జరిగిన రోజున సాయంత్రం జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చినప్పుడు… అప్పటి వరకూ పోలీసులకు ఇవ్వని ఓ లేఖను.. సునీతారెడ్డి.. పోలీసులకు ఇచ్చారు. అంది డ్రైవర్ త్వరగా రమ్మన్నందుకు కొట్టి చంపారన్నట్లుగా ఉంది. అంటే.. కేసు ఫోకస్ మొత్తం డ్రైవర్ పై వెళ్లేలా ఆ లేఖ ఉంది. అది ఎవరు రాశారు..? ఘటనా స్థలం నుంచి ఎవరు స్వాధీనం చేసుకున్నారు..? ఆ లేఖ సునీత వద్దకు ఎలా వెళ్లింది..? సాయంత్రం వరకూ పోలీసులకు ఎందుకివ్వలేదన్న మిస్టరీ.. అలాగే ఉంది. పోలీసులు ఏమైనా చేధించారో లేదో.. వారు వివరాలు వెల్లడిస్తే కానీ తెలియదు. అలా అయిన రెండు రోజులుకు.. సునీత మీడియా ముందుకు వచ్చారు. సిట్ విచారణపై.. పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ అప్పటికే జగన్మోహన్ రెడ్డి.. సీబీఐ విచారణ కావాలంటూ… హైకోర్టులో పిటిషన్ వేశారు. అనూహ్యంగా.. సిట్ విచారణపై పూర్తి నమ్మకం ఉందని.. చెప్పిన సునీతారెడ్డి.. తర్వాతి రోజే.. అమరావతిలో ఎన్నికల అధికారిని కలిశారు. విచారణ సంస్థను మార్చాలని.. సీబీఐకి ఇవ్వాలని కోరారు.
అక్కడ నిరాశ ఎదురు కావడంతో.. నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ముందుగా ఈసీని కలిశారు. అక్కడా అదే సమాధానం వచ్చింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖను కలిశారు. హైకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి… హైకోర్టు నిర్ణయం తర్వాత చూద్దామని పంపించారు. ఓ వైపు.. కేసు విషయంలో పోలీసులు క్లారిటీ వస్తున్నారన్న ప్రచారం బయట జరుగుతూండే సరికి.. సునీతారెడ్డి మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఆ కేసును ఎలాగైనా ఏపీ పోలీసుల పరిధి నుంచి తప్పించాలని.. ఆమె ప్రయత్నిస్తున్నారు. అన్నీ ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఆమె .. కొత్తగా.. సస్పెండైన సీఐ శంకరయ్యపై..అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. సాక్ష్యాలు తుడిచేసిన కేసు మొత్తం… సీఐకు అంటగట్టేలా… వ్యాఖ్యలు చేశారు. బాడీకి కట్లు ఆయనే కట్టించినట్లు, ఆయనే బాడీని కదిలించిటన్లు చెప్పుకొచ్చారు. సునీతారెడ్డి… తాజా వ్యాఖ్యలు చూస్తూంటే.. ఎవరినో ఒకరిని బకరాను చేసి.. అసలు నిందితుల్ని కాపాడాలన్న ప్రయత్నం ఏదో చేస్తున్నట్లుగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.