సీబీఐ అధికారులు వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కు బెయిల్ ఎందుకు ఇవ్వొద్దో అఫిడవిట్ దాఖలు చేశారు. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. దానికి సీబీఐ కౌంటర్ అఫిడవిట్ వేసింది. ఇంతకు ముందే సునీల్ ఎంత డేంజరో వివరిస్తూ వివేకా భార్య సౌభాగ్య కూడా అఫిడవిట్ వేశారు. అయితే సునీల్ యాదవ్ కోణంలో ఆయన ఎంత తీవ్ర నేరం చేశాడో ఎలా హత్యలో భాగస్వామో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. హత్య ఎలా చేశారు.. ఎవరు చేయింంచారన్నది కూడా స్పష్టంగా ఉంది. దానికి ఆధారాలను కూడా వివరించారు. మొత్తంగా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గుట్టు అంతా బయటపడినట్లు స్పష్టమయింది.
నరరూప రాక్షసుల గుట్టు రట్టు చేస్తున్న సీబీఐ !
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యే ముందు రోజు హైదరాబాద్లోని లోటసాండ్ నుంచి పులివెందుల వచ్చారు.. టిక్కెట్ల అంశంపై చర్చకు ఆయన లోటస్ పాండ్ కు వెళ్లారు. వచ్చి ఒక రోజు ప్రచారానికి వెళ్లి రాగానే ఈ హత్య జరిగింది. ఈ హత్య పకడ్బందీగా జరిగిందని.. గుండెపోటుగా నమ్మించేందుకు ప్రయత్నించారని ముందుగానే క్లారిటీ వచ్చేసింది. ఇలా చేసిందెవరో ఇప్పుడు తెలుస్తోంది. అయితే హత్య జరిగిన సమయంలో జరిగిన ఫోన్ కాల్స్ గుట్టు అసలు మనిషి రూప రాక్షసుల్ని బయటకు తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సునీల్ యాదవ్ కోణంలోనే ఈ అఫిడవిట్ దాఖలు చేశారు.
అవినాష్ రెడ్డి విచారణ తర్వాత మరిన్ని సంచలనాలు ఖాయం !
ఇరవై ఎనిమిదో తేదీన అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరు కానున్నారు. ఆయనను రెండో సారి పిలిచారు. విచారణకు హాజరయ్యే ముందే ఈ ఆఫిడవిట్ సీబీఐ దాఖలు చేసింది. అంటే అరెస్ట్ కోసం మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నట్లే అనుకోవచ్చు. ఈ విషయంలో అసలైన సంచనాలు.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఉంటాయన్న ప్రచారం కూడా ఊపందుకుంటోంది. అవినాష్ రెడ్డి నుంచి జగన్, భారతిలకు వెళ్లిన ఫోన్లు… వాటిలో ఏం మాట్లాడుకున్నారన్నది సీబీఐ వెల్లడించే అవకాశం ఉంది. అదే జరిగితే కింగ్ పిన్లు బయటకు రావడం ఖాయమని చెప్పుకోవచ్చంటున్నారు.
అమాయక నట చక్రవర్తుల జాతకం వెల్లడి కాబోతోందా ?
వివేకా హత్యను గుండెపోటుగా చెప్పడమే కాకుండా హత్యగా బయటపడిన తరవాత చంద్రబాబు చేశాడని.. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలు చేశారంటూ… ఏ మాత్రం సిగ్గుపడకుండా … సంబంధం లేని వాళ్ల మీదకు తోసేసే ప్రయత్నాన్ని చేశారు. అది కుదరకపోయే సరి చివరికి వివేకా కుమార్తె, అల్లుడినీ ఇరికించాలని చూశారు. ఇంతటి క్రూరమనస్థత్వం ఉన్న వారు ప్రస్తుతం పవర్ ఫుల్ పొజిషన్లో ఉన్నారు. ముందు ముందు ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి. వివేకాకు న్యాయం జరిగితే అందులో అతి కీలకమైన వ్యక్తుల అసలు గుట్టు బయటపడుతుందన్నది మాత్రం నిజమంటున్నారు.