వైఎస్ ఫ్యామిలీలో అతి ముఖ్యుడైన.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి అరవై రోజులు అయింది. పోలీసులు ఇంత వరకూ ఒక్క ముందడుగు వేయలేకపోయారు. కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా… అచేత స్థితిలో ఉండిపోయారు. ప్రత్యేక దర్యాప్తు బృం౦దాలు… పదకొండు పని చేశాయి. కానీ.. కనీసం… అడుగు ముందుకు వేయలేకపోయారు. అందుకే.. ఇంటర్నెట్లో హు కిల్డ్ బాబాయ్ అంటూ… హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఇంతకీ.. ఈ కేసు పోలీసులు పట్టుకోలేనంత క్లిష్టమైనదా..?
కళ్ల ముందు సాక్ష్యాలున్నా పోలీసులకేం కనిపించడం లేదు..!
వివేకానందరెడ్డి మృతి వార్త బయటకు ఉదయం తొమ్మిది గంటల సమయంలో తెలిసింది. అప్పటికి నాలుగు గంటల ముందు నుంచి అంటే ఉదయం ఐదు గంటల నుంచి… పులివెందులలో హైడ్రామా నడిచింది. అత్యంత కిరాతకంగా… మనిషిని చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడానికి ఆ హైడ్రామా నడిచించింది. చివరికి బయట పడక తప్పలేదు. సాక్ష్యాలు తుడిచేశారు. మృతదేహానికి కుట్లు వేశారు. అసలు.. ఏమీ జరగలేదని చెప్పడానికి ప్రయత్నించారు. ఇలా చేసిన వాళ్లంతా కళ్ల ముందే ఉన్నారు. కానీ ఇంత వరకూ… ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అసలు సూత్రధారులెవరో తెలిసినా ఎందుకు ఆగుతున్నారు..?
స్పష్టమైన సాక్ష్యాలు కళ్ల ముందు ఉన్నా.. పోలీసులు చర్యలు తీసుకోలేకపోవడంతో.. మొదటికే తేడా వచ్చింది. కేసును రాజకీయ రంగు పులిమారు. అదే సమయంలో.. మేమే గెలవబోతున్నామని.. పోలీసు అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. పోలీసు అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో వారు సైలెంటయిపోయారు. అదే సమయంలో… ఎస్పీని బదిలీ చేసి పోలీసుల్ని నైతికంగా ఇబ్బంది పెట్టారు. దాంతో… అసలుకే ఆగిపోయింది. హత్య జరిగిన రోజు సీన్ లో ఉన్న ముగ్గురిపై మాత్రం.. సాక్ష్యాల మాయం కేసులు పెట్టి ఊరుకున్నారు. అసలు సూత్రధారాలు నిర్భయంగా తిరుగుతున్నారు.
ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా తేలే చాన్స్ లేదా..?
వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లుగా… వారి పార్టీ గెలిస్తే.. హు కిల్డ్ బాబాయ్ అనేది.. ఓ హ్యాష్ ట్యాగ్గానే మిగిలిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది.. రాజకీయ వ్యవస్థ… చట్టం, న్యాయాన్ని ఎంత దారుణంగా… అణిచి వేస్తుందో చెప్పడానికి ఉదాహరణ అవుతుంది. ఇప్పటికే.. పోలీసులు ఏ చర్యలు తీసుకోలేకపోవడంతోనే.. ఈ వ్యవహారం బయట పడుతుంది. ఒక వేళ టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా… ఏదో విధంగా రాజీ చేసుకునే ప్రయత్నాలే చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. ఎలా చూసినా.. “హు కిల్డ్ బాబాయ్..” అనేది… ఓ బహిరంగ రహస్యంగానే ఉండిపోయే అవకాశం కనిపిస్తోంది.