కడపలో అవినాష్ రెడ్డి పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కడపలో వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించేవారు ఎవరూ ఆ కుటుంబానికి ఓటేసే అవకాశం లేదు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించేవారు మాత్రం ఈ సారి చీలిపోతున్నారు. రెండు ఓట్లు వేసే అవకాశం ఉండటంతో వారు చెరో ఓటు అన్న కాన్సెప్ట్ అమలు చేసేందుకు సిద్ధమవతున్నారు. జగన్ రెడ్డి ఆస్తి పంచకపోయినా తమ ఓటును పంచేందుకు వైఎస్ అభిమానులు సిద్ధమయ్యారు.
కడప పార్లమెంట్ పరిధిలో షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆమె ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. ర్యాలీలకు జనం వచ్చినా రాకపోయినా… తన పోరాటం గురించి ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేలా చేయగలిగారు., ఇలాంటి చర్చతో … ఆమెకు ఓట్లేసేవారి సంఖ్య పెరుగుతోంది. కరుడుగట్టిన వైసీపీ నేతలు కూడా వైఎస్ గారాల పట్టీకి ఎలా అన్యాయం చేయాలి.. ఓ ఓటు వేద్దాం అన్న అభిప్పాయానికి వస్తున్నారు. ఒక ఓటు జగన్ కు.. ఓ ఓటు షర్మిలకు వేయాలన్న ఆలోచనకు వస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ట్రెండ్ వస్తుందని ఊహించారేమో కానీ షర్మిల పులివెందులలో బలమైన అభ్యర్థిని పెట్టలేదు. సునీత నిలబడతారని ప్రచారం జరిగినా లైట్ తీసుకున్నారు.
పులివెందులలో వైసీపీకి ఓటేసే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్.. పార్లమెంట్ కు వచ్చే సరికి అవినాష్ రెడ్డికి ఓటేసే అవకాశం కనిపించడం లేదు. షర్మిలకు ఓటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన పులివెందులలో అవినాష్ రెడ్డి కన్నా షర్మిల కు ఎక్కువ ఓట్లు వచ్చినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం. ఇతర నియోజకవర్గాల్లోనూ అలాగే ఉంది. విజయమ్మ పుట్టిన ఊరు.. వివేకానందరెడ్డి ఎక్కువగా ప్రభావం చూపే జమ్మలమడుగులోనూ ఇదే ట్రెండ్ ఉంది. క్రమంగా ఇది విస్తరిస్తోంది. జగన్ కు ఓటు వేసే వైసీపీ ఓటు బ్యాంక్ పార్లమెంట్ వరకూ షర్మిలకు వేసే అవకాశాలు ఉన్నాయి.
మరో నాలుగు రోజుల్లో ఓటింగ్ జరగనుంది. షర్మిల దూకుడైన ప్రచారం చేస్తున్నారు. చివరి రోజు రాహుల్ గాంధీ కడపలో ప్రచారం చేసేందుకు వస్తున్నారు. షర్మిల తన దైన స్టైల్లో చేస్తున్న ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. కడప ఈ సారి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు తేవడం ఖాయంగా కనిపిస్తోంది.