వైసీపీ నేతలకు.. ఐ ప్యాక్ టీంకు.. ఆ పార్టీ కార్యకర్తలకు ఫేక్ తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ప్రతీ దాన్ని ఫేక్ చేసుకుని బతికేద్దామనుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా యుగంలో సొంత పార్టీ కార్యకర్తలు కూడా నిజమేంటో ఇట్టే తెలుసుకుంటారు. వారు బయటకు చెప్పకపోయినా వారికీ ఫేక్ అని తెలుస్తుంది. మరి మిగతా వారికి తెలియకుండా ఉటుందా ?
బాలకృష్ణ కుమార్తె, చంద్రబాబు కోడలు బ్రహ్మణి జయలలిత ఫామ్ హౌస్ కొన్నారని వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. నిజానికి చంద్రబాబు పవర్లో ఉంటేఇలాంటి ఆరోపణలు చేసినా ఎవరైనా నమ్ముతారు. అలాంటిదేమీ లేదు. ఊరకనే ఆరోపణలు ప్రారంభించారు. దీంతో బ్రహ్మణి వైసీపీ నేతలపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇలా అనగానే చాలా వరకూ పోస్టులు తొలగించారు. కానీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి తొలగించి తప్పించుకునే పరిస్థితి లేదు.
ఈ వివాదం ఇలా ఉండగానే.. టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకుంటే కాపు సామాజికవర్గం ఓట్లు బదిలీ కాకూడదని ఇప్పటి నుంచి ఐ ప్యాక్ నకిలీ ట్వీట్ హ్యాండిల్స్ విప్లవాన్ని ప్రారంభించారు. సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పెద్ద ఎత్తున పోస్టులు కనిపించడం ప్రారంభించాయి. ఈ పోస్టులు పెడుతోంది.. ఎవరో కానీ.. అందులో ఉన్న హ్యాండిల్స్ మాత్రం.. టీడీపీ లేదా జనసేన మద్దతు దారులన్నవట్లుగా ఉన్నాయి. టీడీపీ యువ నేత నారా లోకేష్ పేరుతో ఓ ట్విట్టర్ అకౌంటర్ కొత్తగా క్రియేట్ అయింది. అందులో రెండు సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టింగ్ పెట్టారు. దీనిపై లోకేష్ స్పందించారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే వారిని చెప్పుతో కొట్టాలన్నారు. కాసేపటికే ఆ ట్విట్టర్ హ్యాండిల్ డీ యాక్టివేట్ అయింది.
ఇలాంటివి చాలా అకౌంట్లు రెడీ చేశారని.. వైఎస్ఆర్సీపీ ఐ ప్యాక్ కార్యకర్తలు.. ఇలాంటివి ..రెండు సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టేలా క్రియేట్ చేస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు. ముందు ముందు ఇలాంటి ఫేక్ దాడి పెరిగిపోతుందని.. అప్పుడు నిజాలు చెప్పినా ప్రజలు నమ్మని పరిస్థితి వస్తుందని… అది స్వయంకృతమే అవుతుందని వైసీపీకి టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.