రజనీకాంత్ ను ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్న మానసిక వికృతం అంతా పై స్థాయిదేనని తేలిపోయింది. రజనీకాంత్ పై తమ నేతలు వినిపించిన తిట్ పురాణాన్ని ఆ పార్టీ అడ్డగోలుగా సమర్థించుకుంది. చంద్రబాబును పొగిడితే తిడతామని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఈ అంశంపై స్పందించింది. 5 కోట్ల మంది ప్రజలు తీర్పునిస్తే 23 సీట్లకు పరిమితమైన పార్టీ టీడీపీ అని.. మూడు సార్లు దారుణంగా ఓడిపోయారని వైసీపీ విమర్శించారు. సొంత ఊరిలో ఓడిపోయి కుప్పానికి పరిగెత్తిన ఫెయిల్యూర్ పాలిటీషియన్.. ఏపీని నాశనం చేసిన ఓ దుర్మార్గుడిని పొగిడితే ప్రశ్నించడం ఏ మాత్రం తప్పు కాదని స్పష్టం చేసింది.
రాష్ట్రాన్ని ఎవరు నాశనం చేశారో స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఎవరు పేద ప్రజల్ని దోచుకుంటున్నారో.. మద్యం అలవాటు ఉన్న కుటుంబాల ఆస్తిపాస్తులు కూడా అమ్ముకునేలా చేసి ఎలా రోడ్డున పడేశారో కనిపిస్తూనే ఉంది. ఏపీలో ఉద్యోగాలే కాదు.. చదువుకునే పరిస్థితులు లేక పొరుగు రాష్ట్రాలకు పరుగులు పెడుతున్న వారు కళ్లెదటే ఉన్నారు. అయినా సరే.. ఎదురుదాడి చేస్తూ..చంద్రబాబును పొగిడారు కాబట్టి అమ్మనా బూతులు తిట్టడం కరెక్టేనని.. తమ రాజ్యాంగంలో ఉందని వాదిస్తున్నారు. వైసీపీ సైకో మనస్థత్వానికి ఈ సమర్థింపు మరో సాక్ష్యంగా కనిపిస్తోంది. అసలు రజనీకాంత్ వైసీపీ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదు.
జగన్ ను ఎంతో మంది పొగుడుతూంటారు. వారెవర్నీ టీడీపీ ఏమీ అనలేదే. ఏమైనా విమర్శలు ఉంటే పద్దతిగా చేయాలి కానీ.. ఆరోగ్య సమస్యల దగ్గర్నుంచి కుటుంబాల్లో మనుషుల వరకూ తీసుకొచ్చి తడతారా ?. ఇంత లేకి మనస్థత్వం ఉన్న పార్టీని ప్రజలు ఓట్లేసి గెలిపించారని .. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు జాలిగా చూసే పరిస్థితులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు అదే అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఎంత మంది ఛీ కొడుతున్నా వైసీపీ నేతల్లో మాత్రం మార్పు రావడ లేదు. మాకు నోటి విరేచనాలు వచ్చు.. ఎవరి మీద కోపం వస్తే వారి మీద చేసుకుంటామన్నట్లుగా ఉన్నారు.