వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన విధానం ఏమిటో తాను నిర్ణయించుకోలేని స్థితిలో ఉంది. తన విధానానికి అనుగుణంగా రాజకీయ అడుగులు సైతం వేయలేని దుర్భర స్థితిలో పడిపోయింది. ఓ వైపు బీజేపీని అడ్డగోలుగా సమర్థిస్తూ.. మరోవైపు ఢిల్లీలో ధర్నాలు చేయడమే దీనికి సాక్ష్యం. వంచనపై గర్జన అంటూ.. ఢిల్లీలో నేడు వైసీపీ దీక్ష చేస్తోంది. ఎందుకు చేస్తోంది..? ఎవరిని నిందిస్తుంది..?
“మా మంచి బీజేపీ” అంటున్నారుగా..! ఇక ఢిల్లీలో ఎందుకు..?
ఒక్క ప్రత్యేకహోదా విషయంలోనే కాదు.. విభజన హామీల విషయాలన్నింటిలోనూ… భారతీయ జనతా పార్టీని.. ఒక్క మాట కూడా అనడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొన్నాళ్ల క్రితం వరకూ… బీజేపీ పేరు ఎత్తేవాళ్లు కాదు. ఓ రకంగా న్యూట్రల్ గా ఉండేవారు. అంటే.. అటు విమర్శించేవారు కాదు.. ఇటు సమర్థించేవారు కూడా. మౌనం అర్థాంగీకారం అన్న పద్దతిలో జనంలోకి వెళ్తోందన్న ఉద్దేశంతో… ఏమో కానీ.. ఆ తర్వాత స్టాండ్ మార్చుకున్నారు. విభజన హామీల విషయంలో… కేంద్రం ఇవ్వకపోవడానికి చంద్రబాబుదే తప్పనడం ప్రారంభించారు. బీజేపీ తప్పేమీ లేదు… చంద్రబాబు తీసుకోలేదన్నట్లుగా… వైసీపీ బీజేపీని వెనకేసుకొచ్చే సమర్థింపు రాజకీయం ప్రారంభించింది. అది ఏ స్థాయికి వెళ్లిందంటే… చివరికి చంద్రబాబు విభజన హామీలపై విడుదల చేసిన మొదటి శ్వేతపత్రానికి కౌంటర్‌గా జగన్ రాయించిన “బ్లాక్ పేపర్”లో బీజేపీని పూర్తి స్థాయిలో సమర్థించారు. ప్రతీ విషయంలోనూ చంద్రబాబుదే తప్పన్నారు.
“విభజన హామీలు” అమలు కానిది చంద్రబాబు వల్లేగా..? ఇక ఢిల్లీలో ఎందుకు..?
ఢిల్లీలో ఎవరైనా నిరసనలు ఎందుకు చేస్తారు..? రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి రాష్ట్రాల్లోనే పెట్టుకుంటారు. ఢిల్లీలో నిరసనలు చేసేది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే. అయితే.. విభజన హామీల విషయంలో… భారతీయ జనతా పార్టీది కానీ.. మోడీది కానీ తప్పేమీ లేదని బహిరంగ వాదనలు వినిపించడం ప్రారంభించిన తర్వాత.. ఢిల్లీలో ధర్నా చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి..?. పాపం.. బీజేపీ చంద్రబాబు వద్దన్నారనే ప్రత్యేకహోదా ఇవ్వలేదని జాలి చూపుతున్నారుగా.. ఇక ఢిల్లీలో నిరసనలు ఎందుకు..? రాజధానికి డీపీఆర్, వెనుకబడిన జిల్లాలకు నిధులు… ఇలా ఏ విషయంలో అయినా చంద్రబాబుదే తప్పని.. వైసీపీ ఎప్పుడో సర్టిఫికెట్ జారీ చేసింది. మరి ఇప్పుడు ఢిల్లీలో నిరసన ఎందుకు..?. తాము కేంద్రంపై పోరాడుతున్నామని ప్రజల్ని మభ్య పెట్టేందుకుకా..?
“మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్” అనడానికి కూడా భయం..! ఢిల్లీలో ఎందుకు..?
వంచనపై గర్జన అంటూ… వైసీపీ చేస్తున్న హడావుడి అంతా.. ఏపీపైనే ఉంటుంది. ఏపీ పైనే ఉంటుంది. ఎప్పుడైనా మోడీని ఒక్క మాట విమర్శించారా..? బీజేపీ, టీడీపీని నమ్మవద్దని మొక్కుబడిగా ఒక్క మాట చెప్పి.. మిగతా అంతా .. చంద్రబాబుపై చెలరేగిపోవడం తప్ప.. ఎప్పుడైనా… మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని .. విభజన హామీలపై నిలదీయడం.. ఎప్పుడైనా చేశారా..? లోక్ సభ నుంచి ఎలాగూ తప్పించుకున్నారు. కానీ బహిరంగసభల్లో అయినా… మోడీ మోసం చేశారు.. నమ్మించి అన్యాయం చేశారని.. ఒక్క మాట కూడా ఎందుకు అనరు…? మోడీ పేరు ఎత్తకుండానే.. ఎవరినో నమ్మించడానికన్నట్లు.. సున్నితంగా ఒకటి రెండు విమర్సలు అంతా చంద్రబాబే చేశారంటూ… చెప్పుకోవడానికి ఢిల్లీలో గర్జన పేరుతో వంచన ఎందుకు..?
…. సుభాష్