ఒక్క సారి అధికారం ఇవ్వండి ప్రతి ఇంట్లో నాన్న గారి ఫోటోతో పాటు నా ఫోటో కూడా పెట్టుకునేలా పరిపాలన చేస్తా అని జగన్ .. ప్రతీ చోటా చెప్పేవారు. ఆయన అంత గొప్పగా పరిపాలన చేసి.. అందరికీ మంచి చేసి..అభిమానంతో ఆ ఫోటోలు పెట్టుకునేలా చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే జగనన్నకూ.., జనాల మధ్య ధింకింగ్లో తేడా వచ్చేది. జగన్ ఆలోచించేది వేరు. జనం ఆలోచించేది వేరు. జగన్ ఇప్పుడు ప్రతీ ఇంట్లోనూ తన తో పాటు .. తన తండ్రి ఫోటోలను పంపుతున్నారు. ఆ ఫోటోలు కూడా ఎవరూ చించకుండా.. పడేయకుండా ఉండేలా గట్టి ప్లాన్ వేసుకున్నారు. ఇప్పుడు చచ్చినట్లుగా ప్రతి ఇంట్లోనూ జగన్ తో పాటు ఆయన తండ్రి ఫోటో ఉండాల్సిందే.
మీ ఆస్తిపై మీకు హక్కు ఇస్తానంటూ జగన్ ఇటీవల సర్వే పథకాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా కొత్తగా ఆస్తి పత్రాలిస్తున్నారు. వాటిలో వస్తున్న తప్పులు. తడకలుసంగతి పక్కన పెడితే.. ఆ ఆస్తిపత్రం పైన ఓ వైపు జగన్ బొమ్మ.. మరో వైపు వైసీపి జెండా తలపాగాలా చుట్టుకుంటున్న వైఎస్ బొమ్మ వేసి ఇస్తున్నారు. అది కూడా గ్రాఫిక్కే . అసలు వైఎస్ ఉన్నప్పుడు వైసీపీ లేదు. ఆ రంగులు లేవు.. ఆ కండువా లేదు. అయినా అచ్చేసి ఇస్తున్నారు. ఈ పత్రాలు చూసి.. వైసీపీ ఫ్యాన్స్ కూడా.. మా ఆస్తులపై ఆ ఫోటోలెందుకని..అభిమానం ఉంటే గోడల మీద పెట్టుకుంటాం కదా అని బాధపడుతున్నారు.
తాము కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు.. ప్రభుత్వం రాసిస్తున్నట్లుగా.. అప్పనంగా ఇస్తున్నట్లుగా తమ పత్రాలపై ఆ బొమ్మలేయడంపై అందరిలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. కానీ నోరు మెదిపితే.. ఆ ఆస్తి వేరే వారి మీదకు వెళ్లినా ఆశ్చర్యం లేదు.అందుకో అందరూ సైలెంట్‌గా తీసుకుంటున్నారు. అయినా ఎన్నికల హామీలను 99,99 శాతం అమలు చేసిన టైప్‌లోనే… ప్రతి ఒక్క ఇంట్లో తన తో పాటు తండ్రి ఫోటోను తీయలేనంతగా పెట్టేస్తున్న జగన్ మాస్టర్ మైండ్‌ను చూస్తే ఎవరికైనా మైండ్ దొబ్బాల్సిందే. ఇంతా చేసి ఆ డాక్యుమెంట్లు చెల్లుతాయా.. అంటే.. చాన్సే లేదు. ఎందుకంటే.. దానికంటూ కొన్ని చట్టాలున్నాయి. అవి బొమ్మలుండటాన్ని అంగీకరించవు.