కోర్టులో కాకాణి గోవర్థన్ రెడ్డికి చెందిన కేసు సాక్ష్యాలే మాయం అయిన కేసులో సీబీఐ … మంత్రికి సబంధం లేదని చార్జిషీటు దాఖలు చేసింది. అసలు కోర్టులో ఆ బీరువాలో… తలుపులు తీసి ఉంచడం ఓ ఎత్తు అయితే… కేవలం ఆ కేసు సాక్ష్యాలే మాయం కావడం.. దీనిపై జిల్లా కోర్టు జడ్జిపై అనుమానాలు వ్యక్తం చేయడం.. పోలీసుల దర్యాప్తు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా ఉండటంతో సీబీఐకి కేసు అప్పగించిది హైకోర్టు. మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే దొంగతనం జరిగింది.
విచారణ జరిగిన హైకోర్టు ఇప్పుడు సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. దొంగతనంలో కాకాణి పాత్రకు ఆధారాలు లేవని పేర్కొంది. దీంతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెరపైకి వచ్చి తన సచ్చీలత గురించి సర్టిఫికెట్ జారీ చేసుకున్నారు. సీబీఐని ఆహా.. ఓహో అన్నారు. మంత్రి మర్చిపోయినదేమిటంటే… అదే సీబీఐని… జగన్ రెడ్డి, సజ్జల అందరూ విమర్శించారు.. కేసులు పెట్టారు… వివేకాకేసులో వేధించారు. తప్పుడు ప్రచారం చేశారు. సీబీఐ చంద్రబాబు జేబులో సంస్థ అన్నారు.
తమకు అనుకూలంగా వస్తే మాత్రం సీబీఐ సూపర్.. వ్యతిరేకంగా వస్తే మాత్రం చంద్రబాబు జేబులో సంస్థ. తాము చేసే నేరాలు ఘోరాలపై దర్యాప్తు సంస్థలు .. చురుకుగా స్పందించి విచారణ చేస్తే మాత్రం.. చంద్రబాబు ముద్ర వేస్తారు. తమకు అనుకులంగా ఉంటే మాత్రం ప్రపంచంలోనే అత్యంత స్వచ్చమైన నిజాయితీగల సంస్థగా కితాబులిస్తారు. ఈ ద్వంద్వ రాజకీయంలో… ఏ మాత్రం సిగ్గుపడని ఒకే ఒక్క పార్టీ వైసీపీ.