ఏపీ అధికార పార్టీ ఏ మాత్రం నీతి లేకుండా చేస్తున్న స్కిట్స్ ప్రజల్ని ఔరా అనిపిస్తున్నాయి. ఏపీలో జరిగిన ప్రతి అల్లరి వెనుక.. ప్రతి ఘర్షణ వెనుక వైసీపీ కార్యకర్తలే ఉన్నారు. పై స్థాయిలో ప్రణాళిక ప్రకారం ఈ దాడులు , దౌర్జన్యాలు జరిగాయి. అవన్నీ వీడియోల్లో స్పష్టంగా ఉన్నాయి. అడ్డగోలుగా గెలిచేయాలని.. బూతుల్ని అక్రమించుకుని మాచర్లలో చేసిన వ్యవహారాలు వీడియోలతో సహా ౭యటకు వచ్చాయి. వారు చేసిన నిర్వాకాలను టీడీపీ చేసిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
వైసీపీ వాళ్లు కొడుతూంటే కొట్టించుకోవాలని ఎదురు తిరిగితే అదిగో తిరిగి కొడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజల ముందు నటిస్తున్నారు. మాచర్లలో జరిగిన ప్రతి ఘర్షణ పిన్నెల్లి కుట్రే. అక్కడ కొత్తగా ఘర్షణలు జరగలేదు. పదిహేనేళ్లుగా అలాంటి పరిస్థితే ఉంది. గత ఐదేళ్లుగా పూర్తి స్థాయి చంబల్ ప్రాంతంగా మార్చేశారు. దాడులు, దౌర్జన్యాలకు లెక్కే లేదు. దానికి సాక్ష్యం స్థానిక ఎన్నికలే. పోలీసుల సాయం చేసిన అరాచకాలతో ప్రజాస్వామ్యాన్ని చంపేశారు. ఎవర్నీ పోటీ కూడా చేయనివ్వకుండా ఏకగ్రీవం చేసుకున్నారు.
అలాంటి నేతలు ఇప్పుడు తెర ముందుకు వచ్చి నీతులు చెబుతున్నారు. అధికారుల్ని మార్చినందునే గొడవలు జరిగాయని.. తమ పని తాము చేసుకోనిస్తే అసలు సమస్య ఎందుకు వస్తుందని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. వాళ్ల ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు రిగ్గింగ్ చేసుకోనిస్తే.. ఈసీ బాగా పని చేసినట్లు.. అడ్డుకుంటే పని చేయనివ్వట్లే. ఇలాంటి సిద్ధాంతాలతో గత ఐదేళ్లుగా ప్రతిపక్షాల్ని వేధించిన వైసీపీ ఇప్పుడు తానే బలయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజలందరికీ ఈ డ్రామాలు అర్థమయ్యాయి మరి. !