అన్న క్యాంటీన్లనూ వైసీపీ స్వాగతించలేకపోతోంది. గతంలో యర్రగొండ పాలెం ఎమ్మెల్యేతో అన్న క్యాంటీన్లను ముష్టి భోజనం అన్నట్లుగా మాట్లాడించారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారాలే చేస్తున్నారు కానీ అన్నార్తులకు అండగా ఉంటుందని చెప్పి మరింత మెరుగైన అన్న క్యాంటీన్ల నిర్వహణకు సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నించడం లేదు. వైసీపీ ఓటమిలో అన్న క్యాంటీన్లది కూడా ఓ పాత్ర అంటే అతిశయోక్తి కాదు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ఏడెనిమిది నెలల ముందు అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో అన్నపూర్ణ పేరుతో ఐదు రూపాయల భోజనం పెడుతూంటారు. అన్నార్తులకు.. అభాగ్యులకు.. రోజు కూలీలకు.. చిరు ఉద్యోగులు..చిరు వ్యాపారాలకు ఆ అన్నపూర్ణ భోజనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ కొన్ని వేల మంది ఆకలి తీరుస్తూ ఉంటుంది. అక్కడి కన్నా మెరుగైన సౌకర్యాలతో అన్న క్యాంటీన్ల్లు ఏర్పాటు చేశారు.
ఏపీలో ఎంతో మంది ముసలి, ముతక ప్రజలకు.. కూలీలకు.. ఆకలి తీర్చింది. వాటికి ప్రజాదరణ ఉందన్న కారణంగానే తాము వచ్చినా కొనసాగిస్తామన్న నమ్మకం ప్రజల్లో కల్పించేందుకు రాజన్న క్యాంటీన్లు అని కొన్ని చోట్ల పెట్టి నాలుగు రూపాయలకే భోజనం పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. అన్న క్యాంటీన్లను నిలిపివేశారు. కనీసం పేరు మార్చుకుని అయినా కంటిన్యూ చేయాలని వచ్చిన సూచనల్ని పట్టించుకోలేదు. అంటే ప్రజల్ని.. అన్నార్తుల్ని వైసీపీ నేతలు ఎంతగా మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించింది.
ఈ వియాన్ని గుర్తించడానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. అందుకే అన్న క్యాంటీన్లపై నెగటివ్ ప్రచారమే చేస్తున్నారు కానీ.. పాజిటివ్‌గా మాట్లాడి.. మెరుగైన అన్న క్యాంటీన్లకు సలహాలు ఇచ్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.