అది గొప్ప కార్యక్రమం మీరు డుమ్మా కొట్టకూడదు..అంటూ కాంగ్రెస్ సహా విపక్షాలకు సీఎం జగన్ సుద్దులు చెప్పారు. ఆయన చేసిన ట్వీట్‌పై ఇప్పుడు రకరకాల సెటైర్లు పడుతున్నాయి. మోదీ కాళ్ల మీద పడింది చాల్లే కానీ లేచి చుట్టూ ఓ సారి చూడు అని సలహాలు వచ్చి పడుతున్నాయి.
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా రాజకీయం జరుగుతోంది. రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని.. తాము ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని 19 విపక్ష పార్టీలు బుధవారం స్పష్టం చేశాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి వైసీపీ హాజరు అవుతుందని స్పష్టం చేశారు.
తమ పార్టీ స్టాండ్ వరకూ తీసుకుని ఆగిపోయి ఉంటే బాగుండేది కానీ ఆనయ పార్లమెంటు అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం. అది మన దేశ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి పార్లమెంట్ భవనం ప్రారంభాన్ని బహిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదు. రాజకీయంగా పార్టీలు తమ అభిప్రాయాలను పక్కనపెట్టి హాజరు కావాలని సూక్తులు ెప్పారు. ఇది ఇతర పార్టీల నేతలను ఆగ్రహానికి కారణం అయింది.
కేసుల కోసం బీజేపీ ముందు పూర్తిగా మోకరిల్లిన జగన్.. ఓ సారి పైకి లేచి పరిస్తితుల్ని చూసుకోవాలని సలహాలిస్తున్నారు. ఆయన హాజరు కావాలంటే హాజరు కావొచ్చు కానీ.. ఇ కబుర్లేమిటని మండి పడుతున్నారు. రాజకీయాల్లో ఏ మాత్రం వ్యక్తిత్వం లేని నేత కూడా తమ సుద్దులు చెబుతున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.